Pawan Kalyan: సంక్రాంతి స్పెషల్.. హరిహర వీరమల్లు పాట ప్రోమో విడుదల
Hari Hara Veeramallu song promo: సంక్రాంతి కానుగా హరిహర వీరమల్లు సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ మాట వినాలి అంటూ సాగే...
Hari Hara Veeramallu song promo: సంక్రాంతి కానుగా హరిహర వీరమల్లు సినిమా నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ మాట వినాలి అంటూ సాగే పాట ప్రోమోను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను స్వయంగా పవన్ ఆలపించారు. తాజాగా విడుదలైన ప్రోమోలో వీరమల్లు మాట వినాలి.. అంటూ పవన్ గొంతు అందరిలో జోష్ నింపుతోంది.
ఈ పాటను ఈనెల 6న విడుదల చేస్తామని గతంలో మేకర్స్ ప్రకటించారు. కానీ వాయిదా పడింది. మళ్లీ ఇప్పుడు సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసి.. పూర్తి పాటను ఈ నెల 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. గతంలో నాలుగైదు చిత్రాల్లో పాటలు పాడిన పవన్... కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో పాడుతుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Beginning the Musical Storm 🎵🌪#HariHaraVeeraMallu 1st Single Promo Out Now 💥#MaataVinaali (Telugu) - https://t.co/ebgZz9mHPY
— Hari Hara Veera Mallu (@HHVMFilm) January 14, 2025
Sung by the one and only, POWERSTAR 🌟 @PawanKalyan garu 🎶🎤
A @mmkeeravaani Musical 🎹
Lyrics by 📝 #PenchalDas
Full song out on 17th Jan at… pic.twitter.com/uTVru2szqg
ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. పవన్ హరిహర వీరమల్లు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈమూవీ మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire