Pandit Jasraj Passes Away: మూగబోయిన హిందుస్థానీ సంగీతం.. పండిత్ జస్‌రాజ్ కన్నుమూత..

Pandit Jasraj Passes Away: మూగబోయిన హిందుస్థానీ సంగీతం.. పండిత్ జస్‌రాజ్ కన్నుమూత..
x
మూగబోయిన హిందుస్థానీ సంగీతం.. పండిత్ జస్‌రాజ్ కన్నుమూత..
Highlights

Pandit Jasraj Passes Away: ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, ప‌ద్మ విభూష‌ణ్ పండిట్ జ‌స్‌రాజ్ అమెరికాలోని న్యూజెర్సీలో క‌న్నుమూశారు. 90 యేండ్ల ఆయ‌న వ‌యోభారంతో తుదిశ్వాస విడిచిన‌ట్టు కుమార్తె దుర్గా జ‌స్ రాజ్ వెల్ల‌డించారు.

Pandit Jasraj Passes Away: ప్రముఖ హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు, ప‌ద్మ విభూష‌ణ్ పండిట్ జ‌స్‌రాజ్ అమెరికాలోని న్యూజెర్సీలో క‌న్నుమూశారు. 90 యేండ్ల ఆయ‌న వ‌యోభారంతో తుదిశ్వాస విడిచిన‌ట్టు కుమార్తె దుర్గా జ‌స్ రాజ్ వెల్ల‌డించారు. 1930లో హ‌రియాణాలోని హిసార్ జిల్లాలో జ‌న్మించిన జ‌స్‌రాజ్ గాయ‌కుడిగా, సంగీత గురువుగా, త‌బాలా వాద్య కారుడిగా విశేష ఖ్యాతి గ‌డించారు. జ‌స్ రాజ్ పాడిన శాస్త్రీయ‌, సెమీ క్లాసిక‌ల్ గీతాలు విశేష ప్ర‌జాధార‌ణ పొందాయి. తనదైన హిందుస్థానీ సంగీతంతో కోట్లాది మంది అభిమానాన్ని చొర‌గొన్నారు. ఆయన హిందుస్థానీ సంగీతంలో సృజించిన ఎన్నో కృతులను బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సంగీత ప్రియులు వాడుకున్నారు. ముఖ్యంగా 'లైఫ్ ఆఫ్ పై' సినిమా కోసం ఆ సినిమా సంగీత దర్శకుడు ఈయన సృజించిన సంగీతాన్నే వాడుకున్నారు. భార‌త్, అమెరికా, కెన‌డాలో ఆయ‌న‌కి అనే మంది అభిమానులు ఉన్నారు.

హిందుస్థానీ సంగీతంలో ఎన్నో అద్భుతాలు సృష్టించిన పండిత్ జస్‌రాజ్‌కు కేంద్రం ఆయన్ని పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులతో సత్కరించింది దాంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఆయన మృతిపై భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసారు. ఆయనతో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. మరోవైపు పండిత్ జస్‌రాజ్ మృతికి పలువురు రాజకీయ ప్రముఖలు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories