Mohan Babu: మోహన్ బాబుకు బిగ్ షాక్..హత్యాయత్నం కేసు నమోదు..పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

Mohan Babu:  మోహన్ బాబుకు బిగ్ షాక్..హత్యాయత్నం కేసు నమోదు..పదేళ్లు  జైలు శిక్ష తప్పదా?
x
Highlights

Mohan Babu: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ టీవీ ఛానెల్...

Mohan Babu: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. పహాడీ షరీఫ్ పోలీసులు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఓ టీవీ ఛానెల్ జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఇంతకు ముందు పోలీసులు బీఎన్ఎస్ లోని 118 కింద కేసు నమోదు చేశారు. కానీ తాజాగా న్యాయ నిపుణుల నుంచి సలహాలు తీసుకుని..తాజాగా మోహన్ బాబుపై 109 సెక్షన్ కింద కేసును మార్చినట్లు సమాచారం.

118 సెక్షన్ లో ఏముంది?

భారత న్యాయ సంహిత 2023లోని 118 సెక్షన్ ప్రకారం..ఎవరిపైనా దాడి చేసినా..వారిని గాయపరిచినా, ప్రమాదకర ఆయుధాలు వాడినా వారిపై కేసు నమోదు చేస్తారు. ఈ కేసు నమోదు చేస్తే 3 ఏళ్ల జైలు శిక్ష లేదంటే 20వేల వరకు జరిమానా విధిస్తారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే జీవిత ఖైదు కూడా విధిస్తారు.

109 సెక్షన్ ఏం చెబుతుంది?

భారత న్యాయ సంహిత 2023లోని 109 సెక్షన్ ప్రకారం..ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశ్యంతోనే దాడి చేసినప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. దీని కింద పదేళ్ల జైలు , జరిమానా కూడా ఉంటుంది. ఈ హత్యాయత్నానికి తెగించినప్పుడు బాధితులకు గాయాలు అయినా..శిక్ష మరింత తీవ్రంగా ఉంటుంది. జీవిత కూడా పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్బాల్లో మరణ శిక్ష కూడా విధిస్తారు.

మోహన్ బాబు విషయంలో ఏం జరగబోతోంది?

జర్నలిస్టుపై దాడికి సంబంధించి మోహన్ బాబు హత్య చేయాలనే ఉద్దేశ్యంతో దాడి చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసహనం, ఆగ్రహంతోనే దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు. మరి పోలీసులు హత్యాయత్నం కేసు ఎందుకు ఫైల్ చేశారన్నది ఓ ప్రశ్నగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories