OTT Telugu This Weekend: ఓటిటిలో ఈ వీకెండ్ కొత్త సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్స్, రొమాంటిక్ కామెడీస్

OTT Telugu This Weekend: ఓటిటిలో ఈ వీకెండ్ కొత్త సినిమాలు.. సస్పెన్స్ థ్రిల్లర్స్, రొమాంటిక్ కామెడీస్
x
Highlights

OTT Telugu Releases This Weekend: ఓటిటిలో కొత్తగా ఏం సినిమాలు వచ్చాయ్.. ఏయే వెబ్ సిరీస్‌లు వచ్చాయ్.. వారం మొత్తం పనిలో పడి తీరిక లేకుండా బిజిబిజీగా...

OTT Telugu Releases This Weekend: ఓటిటిలో కొత్తగా ఏం సినిమాలు వచ్చాయ్.. ఏయే వెబ్ సిరీస్‌లు వచ్చాయ్.. వారం మొత్తం పనిలో పడి తీరిక లేకుండా బిజిబిజీగా తిరిగిన ప్రాణాలకు వీకెండ్ వచ్చిందంటే సరదాగా సమయం గడిపేందుకు వచ్చే ఆలోచనల్లో ఈ ఓటిటి సినిమాలు కూడా ఒకటి. కుటుంబంతో కలిసి థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే బడ్జెట్ తడిచి మోపెడవుతోంది. ఈ భయంతోనే చాలామంది వీకెండ్‌లో థియేటర్ల జోలికి వెళ్లకుండా ఓటిటిలో సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ వీకెండ్ కూడా రానే వచ్చేసింది కనుక కొత్తగా ఓటిటి మార్కెట్లోకి వచ్చిన సినిమాలపై ఓ స్మాల్ లుక్కేద్దామా ??

సారంగదరియ మూవీ

సారంగదరియ మూవీ ఆగస్టు 31న ఆహా ఓటిటిలో రిలీజ్ అవనుంది. పద్మారావు అబ్బిశెట్టి రచించి, డైరెక్ట్ చేసిన సినిమా ఇది. రాజారవీంద్ర, యశస్విని శ్రీనివాస్, మొయిన్, మొహిత్ పెద్దాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా కథనం విషయానికొస్తే.. ఓ మిడిల్ క్లాస్ హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయితో ప్రేమలో పడే స్టోరీ లైన్ తో తెరకెక్కింది.

శివం భజే మూవీ

శివం భజే మూవీలో అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశి జంటగా నటించారు. అబ్ధుల్ అఫ్సర్ హుస్సేన్ డైరెక్ట్ చేసిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో బాలీవుడ్ నటుడు, సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మరో ప్రధాన పాత్రలో నటించాడు. మహేశ్వర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 1నే విడుదల కాగా.. ఆగస్టు 30 అమేజాన్ ప్రైమ్ వీడియో ఓటిటిలో ఆడియెన్స్ ముందుకొచ్చింది.

బడ్డీ మూవీ

బడ్డి మూవీ.. ఫాంటసీ యాక్షన్ జానర్‌లో అల్లు శిరీష్, గాయత్రి భరద్వాజ్, ప్రీశా సింగ్, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. శామ్ ఆంటన్ అనే తమిళ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ సినిమాను జ్ఞానవేల్ రాజా నిర్మించాడు. ఆగస్టు 30వ తేదీ నుండి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తోంది.

హనిమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ

హనిమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీలో హెబ్బా పటేల్, చైతన్య రావు, సుహాసిని మణిరత్నం ప్రధాన పాత్రలు పోషించారు. నేటితరం యువత ఎలా ప్రేమలో పడుతోంది, ఎలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. అంతే వేగంగా డైవర్స్ వరకు ఎందుకు వెళ్తున్నారు అనే కోణంలో తెరకెక్కించిన రొమాంటిక్ కామెడి జానర్ మూవీ ఇది. ఆగస్టు 27న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది.

ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ

స్కూల్‌ చదువులో టాప్ వచ్చిన ఓ కుర్రాడు ఇంటర్ కాలేజీలో చేరాకా అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ప్రేమ అతడి జీవితాన్ని ఎటువైపు తీసుకెళ్లింది, ఎలా మార్చేసింది అనేదే ప్రభుత్వ జూనియర్ కళాశాల. శ్రీనాథ్ పులకురం రచించి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞశ్రీ వేణున్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 27 వ తేదీ నుండి ఆహా ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఆడియెన్స్ ని అలరిస్తోంది.

రాయన్ మూవీ

ధనుష్ నటించి, స్వయంగా డైరెక్ట్ చేసిన రాయన్ మూవీ గత వారం ఆగస్టు 23నే ప్రైమ్ వీడియోలో విడుదలైంది. తన తోబుట్టువులను శత్రువుల నుండి కాపాడుకునేందుకు ఓ చిన్న వ్యాపారం చేస్తూ యువకుడు చేసిన పోరాటమే రాయన్. సందీప్ కిషన్, ప్రకాశ్ రాజ్, ఎస్ జే సూర్య ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories