OTT And Theatre Telugu Movies Release This Week: ఈ వారం వినోదాల పండగే.. హాలీడేస్‌లో ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌..!

OTT And Theatre Telugu Movies Release This Week: ఈ వారం వినోదాల పండగే.. హాలీడేస్‌లో ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌..!
x

OTT And Theatre Telugu Movies Release This Week

Highlights

OTT And Theatre Telugu Movies Release This Week: ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు మరో వారం సిద్ధమైంది. ఎప్పటిలాగే థియేటర్లతో పాటు, ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

OTT And Theatre Telugu Movies Release This Week: ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు మరో వారం సిద్ధమైంది. ఎప్పటిలాగే థియేటర్లతో పాటు, ఓటీటీల్లోనూ కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం దసరా సెలవులు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో ప్రేక్షకులకు ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వనున్నాయి. మరి ఈ వారం థియేటర్లతో పాటు, ఓటీటీల్లోనూ సందడి చేయనున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శ్రీవిష్ణు తాజాగా వస్తున్న మరో చిత్రం 'శ్వాగ్‌'. ఈ సినిమా అక్టోబర్‌ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘వంశ వృక్షం' అనే నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఈ సినిమాలో శ్రీవిష్ణు ఏకంగా నాలుగు భిన్న పాత్రల్లో నటిస్తుండడం విశేషం.

* ఈ వారం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోన్న మరో చిత్రం 'చిట్టి పొట్టి'. ఈ సినిమాలో రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఒక ఆడపిల్ల ముందు చెల్లెలిగా, తర్వాత మేనత్తగా, ఆఖరికి బామ్మ గా.. మారే జర్నీలో ఆమె భావోద్వేగాలు, ప్రేమ, కష్టాలను ఈ సినిమాలో చూపించనున్నారు.

* మంత్ర, మంగళ మూవీస్‌తో ప్రేక్షకులు ఆకట్టుకున్న ఓషో తులసిరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దక్షిణ. సైకో కిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లీడ్‌ రోల్‌లో దక్షిణ నటించింది. అక్టోబర్‌ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది.

* ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న మరో చిత్రం కలి. ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో శివ సాషు రూపొందించిన ఈ సినిమా అక్టోబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ యువకుడి జీవితంలోకి అపరిచిత వ్యక్తి రావడం వల్ల ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి ఇందులో చూపించనున్నారు.

ఓటీటీలో అలరించనున్న మూవీస్‌..

* అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా హౌస్‌ ఆఫ్‌ స్పాయిల్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 3వ తేదీన, ది ట్రైబ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* ఇక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా టిమ్‌ డిల్లాన్‌ (హాలీవుడ్) అక్టోబరు 01వ తేదీన, షెఫ్స్‌ టేబుల్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02న, లవ్‌ ఈజ్‌ బ్లైండ్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02న, అన్‌సాల్వ్‌డ్‌ మిస్టరీస్‌ 5 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 02, హార్ట్స్‌ టాపర్‌3 (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 03, CTRL (హిందీ) అక్టోబరు 04వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

* ఇక జీ5 వేదికగా ది సిగ్నేచర్‌ (హిందీ) అక్టోబరు 04వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.

* జియో సినిమాలో అమర్‌ ప్రేమ్‌కీ ప్రేమ్‌ కహానీ (హిందీ) అక్టోబరు 04వ తేదీన, మనోరమా మ్యాక్స్‌ ఆనందపురం డైరీస్‌ (మలయాళం) అక్టోబరు 04వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

* ఆహా వేదికగా 35 చిన్న కథ కాదు (తెలుగు) అక్టోబరు 02వ తేదీ నుంచి, బాలుగాని టాకీస్‌ (తెలుగు) అక్టోబరు 04వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories