MAA Elections: ఉత్కంఠ రేపుతున్న 'మా' ఎన్నికలు

Ongoing  Suspense on MAA Elections
x

మా ఎన్నికలలో కొనసాగుతున్న ఉత్కంఠ (ఫైల్ ఇమేజ్)

Highlights

MAA Elections: సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎలక్షన్స్

MAA Elections: గత కొంతకాలంగా 'మా' ఎన్నికలు హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి. ఈ సారి మా ఎలక్షన్స్ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన సభ్యులు సోషల్ మీడియా.. మీడియా వేదికగా బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు. మా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, సీవిఎల్ ఉన్నారు. వీరిలో ప్రధాన పోటీ ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు మధ్య ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే మా ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రధాన ఎజెండా.. 'మా బిల్డింగ్'. ఇదే ప్రధాన అంశంగా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టారు.

అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయత్రం దాదాపు 7గంటల సమయంలో ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇవాళ మంచు విష్ణు కూడా తన ప్యానెల్ సభ్యులను ప్రకటించనున్నారు.

ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్‌లో బాబు మోహన్, రఘుబాబు పోటీ చేస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోమన్, జనరల్ సెక్రెటరీగా రఘు బాబు ఉండనున్నారు. అంతేకాకుండా ప్రకాశ్ రాజ్ ప్యానల్‌కు ధీటుగా సీనియర్ నటులను సైతం మంచు విష్ణు రంగంలోకి దించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మా ఎన్నికలు రోజురోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. మరోవైపు జనరల్ సెక్రటరీ పదవి కోసం ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి జీవిత పోటీ పడుతుండగా, బండ్ల గణేశ్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories