NTR's Video call: వీరాభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్.. నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో..
NTR's Video call to his fan: ఎన్టీఆర్ తన వీరాభిమాని కౌశిక్‌కి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ...
NTR's Video call to his fan: ఎన్టీఆర్ తన వీరాభిమాని కౌశిక్‌కి వీడియో కాల్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరీ కౌశిక్.. అతడికి ఎన్టీఆర్ ఎందుకు ఫోన్ చేసి మాట్లాడారు అని జనం ఆ వీడియోను క్యూరియాసిటీతో చూస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టీటీడీలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న శ్రీనివాసులు, సరస్వతి దంపతుల పెద్ద కుమారుడే ఈ కౌశిక్. ప్రస్తుతం కౌశిక్ వయస్సు 19 ఏళ్లు. గత రెండేళ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కౌశిక్, ముందు నుండి ఎన్టీఆర్‌కి వీరాభిమాని. ఎన్టీఆర్ సినిమాలన్నీ విడిచిపెట్టకుండా చూసే కౌశిక్ ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
త్వరలోనే ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే దేవర సినిమా చూడాలని తాను బలంగా కోరుకుంటున్నట్లు కౌశిక్ చెప్పిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆనోటాఈనోటా తన వీరాభిమాని కోరిక గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ చివరకు ఇలా స్పందించారు.
శనివారం కౌశిక్‌కి వీడియో కాల్ చేసిన ఎన్టీఆర్, ఆ వీరాభిమానికి ధైర్యం చెప్పారు. నీకేం కాదు, నువ్వు త్వరగా కోలుకుని రావాలి అని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తను ఆరాధించే స్టార్ హీరో తనకు వీడియో కాల్ చేయడం చూసి షాకైన కౌశిక్.. "నిన్ను చూస్తానని అస్సలు అనుకోలేదు" అని అన్నారు. కౌశిక్ మాటలకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. "భలేవాడివి.. భలేవాడివి.. నేను మాట్లాకపోతే ఎట్లా నీతో" అంటూ కౌశిక్ పట్ల తన ఆప్యాయతను పంచుకున్నారు. కౌశిక్.. ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందని ఆరాతీశారు. అందుకు కౌశిక్ స్పందిస్తూ.. ఇప్పుడు బాగున్నానని.. తాను ధైర్యంగానే ఉన్నానని బదులిచ్చారు. అభిమాని మాటలు విన్న ఎన్టీఆర్.. వెరీ గుడ్.. నువ్వు త్వరగా కోలుకుని బయటికి రావాలి.. దేవర సినిమా చూడాలి అని అన్నారు. సినిమాలకంటే ముందుగా నువ్వు నీ తల్లిదండ్రులను చూసుకోవాలి అని ధైర్యం చెప్పారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న కౌశిక్ తల్లితోనూ ఎన్టీఆర్ మాట్లాడారు. మీరు కూడా దైర్యంగా ఉంటేనే మీ అబ్బాయి కూడా ధైర్యంగా ఉండి కోలుకుంటాడని.. మేమంతా కూడా ప్రార్ధిస్తామని ఎన్టీఆర్ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కౌశిక్ తల్లి స్పందిస్తూ.. తమ అబ్బాయికి మంచి చికిత్స ఇప్పించాల్సిందిగా ఎన్టీఆర్‌కి విజ్ఞప్తి చేశారు. అందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ.. తప్పకుండా తాను అందుకు సంబంధిత వ్యక్తులతో మాట్లాడతానని.. కానీ అంతకంటే ముందుగా మీరు ధైర్యంగా, నవ్వుతూ ఉండాలని సూచించారు.
కౌశిక్ ఆరోగ్య పరిస్థితి విషయానికొస్తే.. అతడి క్యాన్సర్ చికిత్స కోసం 60 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అంత సొమ్ము తమ వద్ద లేనందున దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకుంటే తమ కొడుకు తమకు దక్కుతాడు అని కౌశిక్ తల్లిదండ్రులు దాతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire