NTR: 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రొమో రిలీజ్

Evaru melo koteeswarulu
x

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు 

Highlights

NTR:యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తాజాగా ఆయనకు సంబంధించిన అప్ డేట్ ఒకటి రానేవచ్చింది. ఎన్టీఆర్ ఇక నుంచి బుల్లితెరపై సందడి చేయనున్నారు. ప్రముఖ టెలివిజన్ చానల్లో ప్రసారం అయ్యే 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' రియాలిటీ షోలో ఎన్టీఆర్ హోస్ట్‌గా రానున్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో శనివారం విడుదల అయింది. జెమినీ టీవీ అఫీషియల్‌గా ఎన్టీఆర్ లుక్‌ ప్రమోను శనివారం ఉదయం 11 గంటలకు రిలీజ్ చేసింది. ఈ షో జెమిని టీవిలో వారాంతంలో ప్రసారం కానుంది. ప్రతి శనివారం, ఆదివారం ప్రసారం చేేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఎన్టీఆర్‌కు బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన అనుభ‌వం ఉంది.

'మీలో ఎవరు కోటీశ్వరుడు' తరహాలో 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే రియాలిటీ షోను జెమిని స్టార్ట్ చేసింది. నాలుగు సీజన్లు మా చానల్లో ప్రసారం అయింది. ఈ సారా ఎన్టీఆర్ హోస్ట్ గా ఐదో సీజన్ మాత్రం జెమినిలో ప్రసారం కానుంది. మాటల మాంత్రకుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రోమోను రెడీ చేశారు. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రుడు' సంబంధించిన షూటింగ్ అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగింది. జెమినీ గ్రూప్ కు చెందిన సన్ నెక్ట్స్ ఓటీటి యాప్ లో కూడా ఈ షో ప్రసారం కానుంది. ఈ షో నిమిత్తం జూనియ‌ర్ ఎన్టీఆర్ భారీగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అమితాబ్ బచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి టీవీ షోకు దేశవ్యాప్తంగా గొప్ప ప్రజాదరణ రావడంతో.. తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' పేరుతో చేస్తున్నారు.

అక్కినేని నాగార్జున అప్పట్లో హోస్ట్‌గా 'మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు' అంటూ వచ్చిన పొగ్రాం గుర్తుండే ఉంటుంది. గ‌తంలో నాగార్జున‌ తర్వాత సీజన్‌లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా అల‌రించారు. ఆ షోలో ఎన్టీఆర్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. జెమిని టీవీ గతంలో విడుద‌ల చేసిన ప్రోమోలో చైర్‌లో హోస్ట్ కూర్చుని ఉన్నారు. అయితే, ఆయ‌న ముఖాన్ని నేరు చూప‌కుండా ఓ షాడోను చూపించారు. దాన్ని గ‌మ‌నించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాన హీరోను గుర్తుపట్టేశారు. ఈ షో తాలుకు ప్రోమోను వారు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. తాజాగా ఈ షో కి చెంందిన అధికారిక ప్రకటన రావడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories