Devara: దేవరకు మరో అరుదైన గౌరవం.. హాలీవుడ్‌ ఈవెంట్‌లో..

NTR Devara movie going to be screen in hollywood Beyond festival
x

Devara: దేవరకు మరో అరుదైన గౌరవం.. హాలీవుడ్‌ ఈవెంట్‌లో.. 

Highlights

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి.

దేవర.. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీ ఈ సినిమా కోసం ఎదురు చూస్తోంది. ట్రిపులార్‌ తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్‌ నటిస్తున్న చిత్రం కావడంతో నేషనల్ వైడ్‌గా కూడా మంచి టాక్‌ ఏర్పడింది.

ముఖ్యంగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించడం. సైఫ్‌ అలీఖాన్‌ నెగిటివ్‌ రోల్‌లో నటిస్తుండడంతో బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు అనుగుణంగా కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, ట్రైలర్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాపై అంచనాలను ఒక్కసారి పెంచేసింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికాలో ప్రీ రిలీజ్‌ టికెట్‌ బుకింగ్స్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్న దేవర తాజాగా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. హాలీవుడ్‌లో జరగనున్న ఓ ఈవెంట్లో ‘దేవర’ను ప్రదర్శించనున్నారు. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలిస్‌లో జరగనున్న అతిపెద్ద జానర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ‘బియాండ్‌ ఫెస్ట్‌’లో ‘దేవర’ను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఎన్టీఆర్‌ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు ఈ ఈవెంట్ జరగనుంది.

సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఈజిప్టియన్‌ థియేటర్‌లో ఈ సినిమాను హాలీవుడ్‌ ప్రేక్షకులు, ప్రముఖులు దీన్ని వీక్షించనున్నారు. ఇప్పుడీ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. దీంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. కాగా దేవరలో 40 నిమిషాలపాటు వచ్చే ఓ సీక్వెన్స్‌ సినిమాకే హైలెట్‌గా నిలవనుందని ఇప్పటికే ఎన్టీఆర్‌ తెలిపారు. దీంతో ఇది కూడా సినిమాపై అంచనాలను పెంచేందుకు కారణమైంది. మరి దేవర ఇండియన్‌ ఫిలిమ్‌ ఇండస్ట్రీలో ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories