స్టార్ డైరెక్టర్ శంకర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్

స్టార్ డైరెక్టర్ శంకర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్
x

శంకర్ ఫైల్ ఫోటో 

Highlights

*రోబో చిత్ర కథ విషయమై కొనసాగుతున్న వివాదం *పలుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరించిన శంకర్ *తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా

స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం రోబో. ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా నటించాడు. రోబో చిత్ర కథ తనదే అంటూ అప్పట్లో ప్రముఖ రైటర్ అరూర్ తమిళనందన్ కోర్టుకెక్కారు. తాను రాసిన జిగుబా అనే కథ ఆధారంగా రోబో తెరకెక్కించారని తమిళనందన్ ఆరోపించారు. జిగుబా కథ 1996లో ఓ పత్రికలో ప్రచురితం కాగా, 2007లో నవల రూపంలో వచ్చింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక పర్యాయాలు స్పష్టం చేసినా శంకర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ మేరకు వారెంట్ జారీ చేసిన చెన్నైలోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories