Niharika Divorce: విడాకుల విషయంలో సమంతను ఫాలో చేస్తున్న నిహారిక..?
విడాకుల విషయంలో నిహారిక కొణిదెల టాలీవుడ్ నటి సమంతను ఆదర్శంగా తీసుకుందా. ఔననే అంటున్నారు. విడాకులకు ముందు సమంత ఏవిధంగా ప్రవర్తించిందో సేమ్ టు సేమ్ అదే రీతిలో నిహారిక వ్యవహారం ఉందని నెట్టింట ఓ పోలిక వైరల్ గా మారింది. ఆ పోలిక ఏంటంటే..
Niharika Divorce: సినిమా ఇండస్ట్రీలో విడాకుల కామన్. సెలబ్రిటీల ప్రేమలు, పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగుస్తుంటాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య జంట విడిపోయిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వైవాహిక జీవితం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంది. నిహారిక 2020లో జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకుంది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. పెళ్లైన కొత్తలో ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉందనిపించుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ నిహారిక, చైతన్య మధ్య విభేదాలు వచ్చాయని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి.
నిహారిక, చైతన్య విభేదాల వార్తలకు తగ్గటే వీరి వ్యవహారం కూడా ఉండడంతో విడాకులు కన్ ఫామ్ అని ప్రచారం ఊపందుకుంది. చైతన్య తన ఇన్ స్టా నుంచి తమ పెళ్లి ఫోటోలను డిలీట్ చేయడం..దంపతులు ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, నిహారిక సైతం తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేయడం ఇలాంటి ఘటనలతో నిహారిక డైవర్స్ కన్ ఫామ్ అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
నిహారిక విడాకులకు సంబంధించి మరో ఆసక్తికరకథనం ప్రచారంలోకి వచ్చింది. విడాకుల విషయంలో నిహారిక మరో డైవర్సీ సమంతను ఫాలో చేస్తోందని చెబుతున్నారు. విషయం ఏంటంటే, సమంత తన విడాకులకు ముందు నాగచైతన్య లేకుండా కేవలం తన స్నేహితులతో కలిసి విహార యాత్రకు వెళ్లింది. కట్ చేస్తే ఇప్పుడు ఇదే రీతిలో నిహారిక సైతం తన భర్త చైతన్య లేకుండా కేవలం తన స్నేహితులతో కలిసి బాలికి విహార యాత్రకు వెళ్లింది. మొత్తంగా నాగచైతన్యతో విడాకులకు ముందు సమంత ఏ విధంగా ప్రవర్తించిందో..అదే రీతిలో నిహారిక వ్యవహారం కూడా ఉందని నెట్టింట పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
పరిస్థితులు చూస్తుంటే నిహారిక, చైతన్య అఫీషియల్ గా విడాకులు తీసుకుంటున్నట్లు చెప్పకపోయినా..అదే జరగనుందని ఇండస్ట్రీలో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. నిహారిక, చైతన్య మధ్య కొన్ని ఆస్తి వివాదాలు ఉన్నాయని..అవి కొలిక్కి రాగానే విడాకుల వార్తను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ చెప్పుకుంటున్నారు. ఏదిఏమైనా, ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట విడిపోవడం..మెగా ఫ్యాన్స్ ను కించిత్ విచారానికి గురి చేస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire