Nidhhi Agerwal: చంపేస్తానంటూ బెదిరింపులు.. పోలీసులకు కంప్లైంట్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్

Nidhi Agarwal Filed A Case Against Netizen Harassing Her In Social Media
x

Nidhhi Agerwal: చంపేస్తానంటూ బెదిరింపులు.. పోలీసులకు కంప్లైంట్ చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్

Highlights

Nidhhi Agerwal: సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై హీరోయిన్ నిధి అగర్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Nidhhi Agerwal: సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్న వ్యక్తిపై హీరోయిన్ నిధి అగర్వాల్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కంప్లైంట్‌లో సదరు వ్యక్తి తనను చంపేస్తానని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నాడంటూ ఆమె ఆ ఫిర్యాదులో తెలిపారు. తనతో పాటు తనకు ఇష్టమైన వారిని కూడా బెదిరిస్తున్నారని నిధి ఫిర్యాదు చేశారు. దీంతో తాను మానసిక ఒత్తిడికి గురౌతున్నానని ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఇక నిధి అగర్వాల్‌ కెరీర్ విషయానికొస్తే ఈ ఏడాది తనకు చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నిధి రెబల్ స్టార్ ప్రభాస్‌ సరసన రాజా సాబ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి హరహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. అయితే కొందరు దీనిని మంచికి ఉపయోగిస్తుంటే.. మరికొందరు చెడుకు వాడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువయ్యాయి. ఇలాంటి విషయాల పట్ల సెలబ్రిటీలు కూడా చాలా సీరియస్ గా ఉంటున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో తనను ఓ వ్యాపారవేత్త వేధింపులకు గురిచేస్తున్నారంటూ హానీ రోజ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దాదాపు 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ కేసులో కీలకమైన వ్యక్తిని అరెస్ట్ చేసి అతనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories