ఓటీటీలను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారా.. కారణం ఏమిటీ..?

ఓటీటీలను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారా.. కారణం ఏమిటీ..?
x

ఓటీటీలను ప్రేక్షకులు పట్టించుకోవడం మానేశారా.. కారణం ఏమిటీ..?

Highlights

కరోనా టైమ్‌లో ప్రేక్షకులను అలరించాయి ఓటీటీలు. థియేటర్లు మూతపడటంతో నిర్మాతలు కూడ తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్‌ చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు....

కరోనా టైమ్‌లో ప్రేక్షకులను అలరించాయి ఓటీటీలు. థియేటర్లు మూతపడటంతో నిర్మాతలు కూడ తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్‌ చేశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది. రాను రాను నిర్మాతలు, ప్రేక్షకులు ఓటీటీలను పట్టించుకోవడం మానేశారు. కారణం ఏమిటీ..?

కరోనా, లాక్‌డౌన్‌‌ కారణంగా సినీ ప్రేక్షకులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సమయంలో చాలా వరకు ఓటీటీలు ఆహ్లాదాన్ని పంచాయి. ఇక మరో వైపు చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్‌ చేసుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. మరో వైపు థియేటర్లు మూతపడటంతో ఓటీటీలు బాగానే పుంజుకున్నాయి.

థియేటర్లు ఓపెన్‌ అయ్యాయి. గత నెల నుంచి సినిమాలు థియేటర్లలో రిలీజ్‌ అవుతున్నాయి. ఓటీటీల్లో తమ సినిమాలనే రిలీజ్‌ చేయడానికి హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. ఇక కొత్త నిర్మాతలు, హీరోలు బిగ్‌ స్క్రీన్‌లపై తమ పేరు చూసుకోవాలనే ఆశతో ఉన్నారు. దీంతో ఓటీటీల్లో సినిమాల రిలీజ్‌ల సంఖ్య తగ్గుతుంది.

ఇప్పుడు చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు, కొత్త హీరో నుంచి సీనియర్‌ హీరోల వరకు తమ సినిమాలను థియేటర్‌లలోనే రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో ఓటీటీలకు వ్యూవర్శిప్‌, రిలీజ్‌లు భారీగా తగ్గాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories