New twist in shyam k naidu case : శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్

New twist in shyam k naidu case : శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్
x
Highlights

New twist in shyam k naidu case : ప్రముఖ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. గతంలో ఆర్టిస్ట్ సాయి సుధ శ్యామ్ కే నాయుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అంటూ ఎస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే..

New twist shyam k naidu case : ప్రముఖ సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు కేసులో కొత్త ట్విస్ట్ ఏర్పడింది. గతంలో ఆర్టిస్ట్ సాయి సుధ శ్యామ్ కే నాయుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు అంటూ ఎస్ ఆర్ నగర్ పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ కే నాయుడుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత రెండు రోజుల్లోనే శ్యామ్ కే నాయుడు బెయిల్‌పై బయటకు వచ్చారు.

దీనిపైన కేసు నడుస్తున్న నేపధ్యంలో సాయి సుధతో తను రాజీ కుదుర్చుకున్నట్లు శ్యామ్ కే నాయుడు నాంపల్లి కోర్టులో బెయిల్‌ ఫిటిషన్‌ దాఖలు చేశాడు. అతనికి నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే అతనికి బెయిల్ మంజురూ చేయడం పట్ల సవాల్‌ చేస్తూ సాయి సుధ కోర్టును ఆశ్రయించింది. దొంగ సంతకం పెట్టి, బెయిల్ కు తాను ఒప్పుకున్నట్లు న‌కిలీ పత్రాన్ని సృష్టియించాడ‌ని న్యాయస్థానంలో సాయి సుధ తెలిపింది దీనిపైన విచారణ చెప్పటిన కోర్టు శ్యామ్ ‌కే నాయుడు బెయిల్‌ను రద్దు చేసింది. అంతేకాకుండా ఫోర్జరీ సంతకం చేసినందుకు గాను అతనిపై మరో కేసు నమోదైంది. దీనితో మరోసారి చిక్కుల్లో పడ్డాడు శ్యామ్..

ఇక చోటా కే నాయుడు తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు శ్యామ్ కే నాయుడు.. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకి శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫర్ గా పనిచేశాడు. ఎక్కువగా ఆడియో ఫంక్షన్ లలో కనిపించని శ్యామ్, తన పనేదో తానూ చేసుకుంటూ పోతాడు. ఇక చాలా నెమ్మదస్తుడిగా అతనికి పేరు ఉంది.. ఇలాంటి శ్యామ్ కే నాయుడు ఇప్పుడు ఇలా చిక్కుల్లో ఇరుక్కోవడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇక సాయి సుధ అర్జున్ రెడ్డి సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories