New Telugu OTT Releases This Week: ఓటీటీలో ఈ వీకెండ్ మీకు పండగే పండగ

New Telugu OTT Releases This Week: ఓటీటీలో ఈ వీకెండ్ మీకు పండగే పండగ
x
Highlights

ఈ వీకెండ్‌లో మిమ్మల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు వివిధ జానర్లలో సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. అందులో కొన్ని ఎగ్జైటింగ్ షోస్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.

New Telugu OTT Releases This Weekend : వీకెండ్ రానే వచ్చేసింది. ఈ వీకెండ్‌లో మిమ్మల్ని అలరించడం కోసం వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వివిధ జానర్లలో భారీ సంఖ్యలో సరికొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రెడీగా ఉన్నాయి. అందులో కొన్ని నేరుగా తెలుగులో తెరకెక్కినవి కాగా... ఇంకొన్ని ఇతర భాషల నుండి డబ్బింగ్ అయినవి ఉన్నాయి. అందులో కొన్ని ఎగ్జైటింగ్ షోస్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి.

డార్లింగ్ తెలుగు సినిమా ( Darling Telugu Movie 2024 )

ప్రియదర్శిని, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడి మూవీ డార్లింగ్. అశ్విన్ రామ్ అనే కొత్త దర్శకుడిని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఈ సినిమాలో భార్యను హనీమూన్ కోసం పారిస్‌కి తీసుకెళ్లాలి అనే కలలు కనే పాత్రలో ప్రియదర్శిని, మల్టిస్ల్పిట్ డిజార్డర్ కలిగిన భార్య పాత్రలో నభా నటేష్ నటించారు అనేకంటే కడుపుబ్బా నవ్వించారు అని చెప్పొచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా ఆగస్టు 13 నుండే అందుబాటులోకి వచ్చింది.

OMG ఓ మంచి ఘోస్ట్ తెలుగు మూవీ

తెలుగులో ప్రస్తుతం ఎంటర్‌టైన్ చేస్తోన్న హారర్ కామెడి సినిమాల జాబితాకు ఓ మంచి ఘోస్ట్ అనే తెలుగు మూవీ ఓ కొత్త యాడాన్‌గా వచ్చి చేరింది. వెన్నెల కిషోర్, నందిత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ హారర్ కామెడిలో బ్రీఫ్‌గా స్టోరీ ఏంటంటే.. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేందుకు ఈజీ మనీ కోసం వెదుకుతున్న నలుగురు యువకులు ఓ ఎమ్మెల్యే కూతురుని కిడ్నాప్ చేయాలని డిసైడ్ అవుతారు. ఆ తరువాత కథలో అనేక ట్విస్టులు చోటుచేసుకుంటాయి. అవేంటో తెలియాలంటే ఓఎంజీని చూసేయాల్సిందే. ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 15 నుంచే ఈ సినిమా మీ కోసం రెడీగా ఉంది.

EVOL - ఏ లవ్ స్టోరీ ఇన్ రివర్స్

పేరులోనే వెరైటీ ఉంది కదా.. ఔను.. పేరుకు తగినట్టుగానే ఇందులో కథాంశం కూడా కొంత వెరైటీగానే ఉంటుంది. ఎంతలా అంటే... జులైలోనే ఆడియెన్స్ ముందుకు రావాల్సిన ఈ సినిమా.. సెన్సార్ సమస్యల వల్ల ఆగస్టు 15న ఆడియెన్స్ ముందుకు వచ్చేంతగా. రామ్ యోగి వెలగపూడి స్వయంగా డైరెక్ట్ చేసి నిర్మించిన ఈ సినిమాలో ఒకేసారి ఇద్దరు ప్రియులతో రొమాంటిక్ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఓ యువతి కథ కనిపిస్తుంది. అక్రమ సంబంధాల వల్ల జీవితానికి కలిగే చేటు గురించి చెప్పే ఈ సినిమా ఆహా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది.

పేకమేడలు తెలుగు మూవీ ( Pekamedalu Telugu Movie )

బీటెక్ చేసిన లక్ష్మణ్ అనే ఓ యువకుడు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో మిలియనీర్ అవ్వాలని కలలు కంటుండగా... అతడి భార్య వరలక్ష్మి తనే సొంతంగా బిజినెస్ స్థాపించి రాణించాలని తాపత్రయ పడుతుంది. ఈ జర్నీలో వాళ్ళు ఎదుర్కునే ఇబ్బందులే పేకమేడలు మూవీ.

మనోరతంగల్ ( Manorathangal Telugu Webseries - మలయాళం నుండి డబ్ చేసిన తెలుగు వెబ్ సిరీస్)

మోహన్ లాల్, మమ్ముట్టి, కమల్ హాసన్ వంటి మహామహులతో పాటు ఫహద్ ఫాసిల్, మధుబాల లాంటి స్టార్స్ కలిసి పని చేసిన ఈ వెబ్ సీరీస్ ఆగస్టు 15 నుండి జీ5 యాప్‌లో స్క్రీనింగ్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories