New Heroine in BalaKrishna Cinema: బాలయ్య సరసన కొత్త హీరోయిన్.. బోయపాటి క్లారిటీ!

New Heroine in BalaKrishna Cinema: బాలయ్య సరసన కొత్త హీరోయిన్.. బోయపాటి క్లారిటీ!
x
balaiah new movie
Highlights

New Heroine in BalaKrishna Cinema: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం

New Heroine in BalaKrishna Cinema: నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఓ స్పెషల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బోయపాటి మరోసారి బాలయ్య ని ఫుల్ మాస్ యాంగిల్ లో చూపిస్తున్నాడన్నది ప్రేక్షకులకి అర్ధం అయిపోయింది.

అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన పలానా హీరోయిన్స్ నటిస్తున్నారు అంటూ ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకి తమన్నా, కేథరీన్, సోనాక్షి సిన్హా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కానీ అవేమి నిజం కాలేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉన్న నేపధ్యంలో ఒక కథానాయికగా తెలుగు నటి అంజలిని ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. ఇక మరో హీరోయిన్ గా శ్రియ, అమలపాల్ పేర్లు అనుకుంటున్నట్టుగా ప్రచారం కూడా సాగింది. అయితే ఇటీవల దర్శకుడు బోయపాటి శ్రీను వీటిపైన స్పందిస్తూ.. ఈ సినిమాలో కొత్త హీరోయి‌న్‌ను పరిచయం చేయబోతున్నామని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పటికే సెలక్షన్‌ కూడా పూర్తయ్యాయని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని బోయపాటి వెల్లడించారు.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి మామూలు పాత్ర కాగా ఇంకోటి అఘోర పాత్ర అని ఇప్పటికే బోయపాటి వెల్లడించాడు. ఇక ఈ సినిమాకి మొన్నటివరకు మోనార్క్ అనే టైటిల్ వినిపించగా మళ్ళీ కొత్తగా 'సూపర్ మ్యాన్' అనే టైటిల్ స్ప్రెడ్ అవుతుంది. కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్న తరవాత అంటే ఈ ఏడాది ఆఖరిలో ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలయ్యే అవకాశం ఉందని ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories