Netflix Series IC814 Kandahar Hijack: కాందహార్ హైజాక్ సిరీస్‌ను బ్యాన్ చేయాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్

Netflix Series IC814 Kandahar Hijack Petition in Delhi High Court to ban Kandahar hijack series
x

Netflix Series IC814 Kandahar Hijack: కాందహార్ హైజాక్ సిరీస్‌ను బ్యాన్ చేయాలని దిల్లీ హైకోర్టులో పిటిషన్

Highlights

Netflix Series IC814 Kandahar Hijack:ఈ మధ్యే డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ అయిన ఐసీ 814 ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది.యాదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో కొంత సమాచారం వక్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముస్లిం టెర్రరిస్టుల పాత్రలకు హిందువులపేర్లు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో ది కాందహార్ హైజాక్‌పై నిషేధం విధించాలని కోరుతూ సోమవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Netflix Series IC814 Kandahar Hijack: ‘ఐసీ 814: ది కాంధార్‌ హైజాక్‌’ వెబ్ సిరీస్..డైరెక్టుగా ఓటీటీలోకి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు వివాదం ఇరుక్కుంది. యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో కొంత సమాచారం వక్రీకరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ముస్లిం టెర్రరిస్టుల పాత్రలకు హిందువుల పేర్లు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈనేపథ్యంలో విచారణకు హాజరు కావాలని సమాచారా, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ ఫ్లిక్స్ అధినేతకు సమన్లు కూడా జారీ చేసింది. భోలా, శంకర్ లు అనేవి ఉగ్రవాదుల కోడ్ నేమ్స్ అంటూ కొందరు వాదించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సర్టిఫికేట్‌ను రద్దు చేసి, సిరీస్‌ని ప్రజల వీక్షణను నిషేధించేలా కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రైతు, హిందూ సేన అధ్యక్షుడు సుర్జిత్ సింగ్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.

హైజాకర్ల వాస్తవ గుర్తింపుల గురించి కీలకమైన నిజాలను వక్రీకరించడం చారిత్రక సంఘటనలను తప్పుగా సూచించడమే కాకుండా,తప్పుడు సమాచారాన్ని అందించింది. ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తుందని..కోర్టు జోక్యం చేసుకుని ఈ సిరీస్ ను నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో నేడు విచారణకు హాజరుకావాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ ఫ్లిక్స్ అధినేతకు సమన్లు కూడా జారీ చేసింది. దేశం మనోభావాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదని తెలిపింది.

డిసెంబర్ 4,1999న నేపాల్ లోని ఖాట్మండు నుంచి ఢిల్లీకి బయలు దేరిన విమానాన్ని పాక్ టెర్రరిస్టులు హైజాక్ చేశారు. ఆ విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. అమృత్‌సర్, లాహోర్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో తిరిగి వచ్చి , మరుసటి రోజు అంటే డిసెంబర్ 25న ‘IC 814’ విమానం ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌ ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేశారు. భారత జైల్లో ఉన్న పాక్ ఉగ్రవాదులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ హైజాక్ జరిగింది. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని ‘IC814: ది కాందహార్ హైజాక్’ వెబ్ సిరీస్ ను తీశారు. విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులను ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయిూద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జవహర్ మిస్త్రీ షకీర్ లుగా గుర్తించారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో ఉగ్రవాదుల పేర్లను భోలా, శంకర్ గా చూయించారు. ఇది హిందూవుల మనోభావాలనుదెబ్బతీసిందని ఈ వెబ్ సిరీస్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిరీస్ దర్శకుడు అనుభవ్ సిన్హాను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారు.



ఈ వ్యవహారంపై నేడు అంటే సెప్టెంబర్ 3న విచారణకు హాజరవ్వాలని సమాచారా, ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ ఫ్లిక్స్ చీఫ్ కు సమన్లు జారీ చేసింది. ఈ వివాదంతో మరోసారి బాయ్ కాట్ బాలీవుడ్ అంటూ ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories