Tollywood: 'బాహుబలి'ఓ చెత్త.. మళ్లీ తీయండన్న నెట్‌ఫ్లిక్స్

Netflix Rejected bahubali movie
x

బాహుబలి ఫైల్ ఇమేజ్ 

Highlights

Tollywood: భారత దేశ చలన చిత్ర చరిత్రనే తిరగరాసి, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఘడించిన బాహుబలి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Tollywood: భారత దేశ చలన చిత్ర చరిత్రనే తిరగరాసి, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి ఘడించిన బాహుబలి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది ఈ మూవీ. ఈ మూవీ విజయం తర్వాత టాలీవుడ్ సినిమా స్థాయి అమాంతం పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమాలు బాహుబలి తర్వాత బాహుబలికి ముందు అనే చెప్పాలి. అయితే బాహుబలి చిత్రన్ని వెబ్ సిరీస్ గా తీసుకురావాలని ధర్శకధీరుడు రాజమౌళి భావించాడు. అనుకున్నట్లుగానే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పదం చేసుకున్నారు. బాహుబలి బిగినింగ్ ముందు మహిష్మతి రాజ్యం, శివగామి పాత్ర ప్రత్యేకతలు, ఇలా పలు అంశాలను ప్రస్తావించారు. దానికి బిఫోర్ ద బిగినింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. దాంతో బాహుబలి వెబ్ ‎‌సిరీస్ వంద కోట్లు పెట్టి రూపొందించాడు.

అయితే సిరిస్‌ను భారీ స్థాయిలో షూట్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా ఫైనల్ కట్ చూసుకున్నఓటీటీ సంస్థ నిర్మాతలకు భారీ షాకిచ్చింది. సినిమా చాలా చెత్తగా వచ్చిందని నెట్ఫ్లిక్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మళ్లీ రీషూట్ చేయాలని సరికొత్తగా ప్లాన్‌ చేయమని నిర్మాతలను ఆదేశించిందట. భారీ సినిమాలను ఓటీటీలో విడుదల చేసే నెట్‌ఫ్లిక్స్‌ మొదటిసారి తెలుగులో సినిమాను తీసుకోవాలని భావించింది. అందులో భాగంగానే బాహుబలి బిఫోర్ ద బిగినింగ్ అంగీకరించింది.

క్వాలిటీ విషయంలో అసలు రాజీపడని నెట్‌ఫ్లిక్స్..‌ ఈ 9 ఎపిసోడ్లు చూసి ఆశ్చర్యపోయిందట. క్వాలిటీ ఇంత డొల్లగా చెత్తగా తీశారేంటని ప్రశ్నించిందని టాక్. దీంతో ఆ ఎపిసోడ్లన్నింటినీ క్యాన్సిల్‌ చేసినట్లు సమాచారం. రూ.100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరన్నమాటే. సిరీస్ బాగారాకపోవడానికి బడ్జెట్ అని భావించిన నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా రూ.200 కోట్లు కేటాయించి మరీ ఈ వెబ్‌సిరీస్‌ను సరికొత్తగా ప్లాన్‌ చేయమని నిర్మాతలను ఆదేశించిందట. ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నవారిలో రాజమౌళితో పాటు ప్రవీణ్ సత్తారు కూడా ఉన్నారు. ఈ సిరీస్ ను ప్రముఖ దర్శకుడు దేవకట్టా డైరెక్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories