నయనతార పెళ్లి అయిపోయిందా.. ?

Nayanthara Sindoor on Forehead
x

నయనతార పెళ్లి అయిపోయిందా.. ?

Highlights

Nayan Vignesh: ప్రముఖ సౌత్ స్టార్ బ్యూటీ నయనతార గత కొంత కాలంగా డైరెక్టర్ విగ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Nayan Vignesh: ప్రముఖ సౌత్ స్టార్ బ్యూటీ నయనతార గత కొంత కాలంగా డైరెక్టర్ విగ్నేష్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఎప్పటికప్పుడు కెమెరాలకి చిక్కుతూనే ఉంటారు. ఇక వీరు సీక్రెట్‌గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. మీడియా, అభిమానులు వీరి పెళ్లి ఎప్పుడు అని అడగగా త్వరలోనే చేసుకుంటామని ప్రతిసారి చెప్తున్నారు. ఇన్నాళ్లు ఎంగేజ్మెంట్ ఒక్కటే సీక్రెట్‌గా జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా వీరిద్దరికి పెళ్లి కూడా ఐపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా నయనతార మరియు విగ్నేష్ చెన్నైలోని ఒక అమ్మవారి గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం వారు దేవాలయ సిబ్బంది తో ఫోటోలు దిగారు.

దీనికి సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దానికి కారణం ఆ వీడియోలో నయనతార నుదిటిపై సింధురం ఉండటం. అంటే వీరిద్దరికీ పెళ్లి అయిపోయిందా అంటూ నెటిజన్లు ఆ వీడియో కింద కామెంట్లు చేస్తున్నారు. దీని గురించి నా అధికారికంగా ప్రకటన ఎప్పుడు విలువడుతుందో చూడాలి. ఇక సినిమాల పరంగా చూస్తే ఈ మధ్యనే "అన్నాతె" సినిమాలో కనిపించిన నయనతార తాజాగా ఇప్పుడు "కాతు వాకుల రెండు కాదల్" సినిమాలో విజయ్ సేతుపతి సరసన నటిస్తోంది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాతో కూడా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది నయనతార.


Show Full Article
Print Article
Next Story
More Stories