Nayanthara: ఫోన్ విరగకొట్టేస్తాను అని అభిమానిని బెదిరించిన నయనతార

Nayanthara Got Extremely Angry Over the Behaviour of Fans Public
x

Nayanthara: ఫోన్ విరగకొట్టేస్తాను అని అభిమానిని బెదిరించిన నయనతార 

Highlights

Nayanthara: పబ్లిక్ లో ఫ్యాన్ పై విరుచుకుపడిన నయనతార

Nayanthara: వెండి తెర మీద కంటే తమ అభిమాన నటీనటులను బయట చూడడానికి అభిమానులు ఇంకా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎవరైనా సెలబ్రిటీ కనిపిస్తే ఆటోగ్రాఫ్ లేదా ఫోటోగ్రాఫ్ అని అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా తమ ఫోన్ లో వారిని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు. కానీ అభిమానులకు ఉండే విపరీతమైన ప్రేమ సెలబ్రిటీలకి కొంత ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార విషయంలో కూడా అదే జరిగింది.

ఈ మధ్య తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి కుంభకోణం లోని కామాక్షి అమ్మవారి గుడికి ట్రైన్ లో వెళ్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు గుడి వద్ద గూమి గూడారు. తరలివచ్చిన అభిమానులను పోలీసులు కూడా ఆపలేకపోయారు. దీంతో విగ్నేష్ శివన్ స్వయంగా బయటకు వచ్చి అభిమానులను ఆపడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ అభిమానులు ఏమాత్రం వెనక్కి తగ్గకపోవడంతో నయనతార మరియు విగ్నేష్ తమ పూజని త్వరగా పూర్తిచేసి తిరిగి రైల్వే స్టేషన్ కి బయలుదేరారు.

రైల్వేస్టేషన్లో నయనతార ను చూసిన ఒక యువ అభిమాని ఆమెను ఫోన్లో వీడియో తీస్తూ ఫాలో అయ్యాడు. దీంతో ఇరిటేట్ అయిపోయిన నయనతార "రికార్డింగ్ ఆపేసేయ్.. లేకపోతే నీ ఫోన్ విరగకొట్టేస్తాను..," అంటూ అతనిపై విరుచుకుపడింది. అలా ఒక యువ అభిమాని పై నయనతార మండిపడింది. సెలబ్రిటీలు బయట కనిపిస్తే ఇలాంటివి జరగటం చాలా సహజం. కానీ సమయం సందర్భం లేకుండా ఎక్కడపడితే అక్కడ వీడియోలు రికార్డ్ చేస్తే సెలబ్రిటీలు సైతం విసుక్కోక మానరు.

Show Full Article
Print Article
Next Story
More Stories