Love mouli: ఓటీటీలోకి నవదీప్‌ బోల్డ్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

Navdeep latest movie love mouli ott streaming in aha from june 27th
x

 Love mouli: ఓటీటీలోకి నవదీప్‌ బోల్డ్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే 

Highlights

Love mouli: లవ్‌మౌళి సినిమా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్‌ 27వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది.

Love mouli: గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ సినిమా ద్వారా హీరోగా విజయాన్ని అందుకున్న నవదీప్‌ ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా వరుస సినిమాల్లో నటించారు. హీరోకి ఫ్రెండ్‌ పాత్రతో పాటు పలు నెగిటివ్‌ షేడ్స్‌ పాత్రలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. చాలా రోజుల పాటు హీరో పాత్రకు దూరంగా ఉంటూ వచ్చిన నవదీప్‌ తాజాగా హీరోగా తెరకెక్కిన సినిమా లవ్‌మౌళి.

ఫంకూరీ గిద్వానీ హీరోయిన్‌గా అవనీంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'లవ్‌మౌళి' సినిమా జూన్‌ 7వ తేదీన థియేటర్లలో విడుదైలంది. విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్‌ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా బోల్డ్‌ కంటెంట్‌ యూత్‌ను అట్రాక్ట్‌ చేసింది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో రానుంది.? స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో ఇప్పుడు తెలుసుకుందాం.

లవ్‌మౌళి సినిమా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. జూన్‌ 27వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆహా అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చిన్నప్పుడే పేరెంట్స్ విడిపోవడంతో మౌళి (నవదీప్‌) ఒంట‌రిగా పెరుగుతుంటాడు. మేఘాల‌య‌లోని రిసార్ట్‌లో ప్ర‌కృతి మ‌ధ్య త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా బ‌తుకుతుంటాడు. పెయింటింగ్స్‌ వేస్తూ వచ్చిన డబ్బుతో ఎంజాయ్‌ చేస్తుంటాడు.

చిన్న తనంలో తాను చూసిన సంఘటనల వల్ల మౌళికి ప్రేమపై పెద్దగా నమ్మకం ఉండదు. అదే సమయంలో ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) ఇచ్చిన పెయింటింగ్ బ్ర‌ష్‌తో తాను కోరుకునే ల‌క్ష‌ణాలున్న అమ్మాయిని సృష్టించే శ‌క్తి మౌళికి వ‌స్తుంది. స్వతహాగా చిత్రకారుడైన మౌళి వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు వారి ప్రేమ బంధం సాఫీగా సాగుతుంది. ఆ త‌ర్వాత‌ చిత్ర‌తో గొడ‌వ‌లు రావ‌డంతో మ‌రో పెయింటింగ్ గీస్తాడు మౌళి. మరోసారి కూడా చిత్ర‌నే అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. మరి ఆ తర్వాత మౌళి, చిత్ర ఒక్క‌ట‌య్యారా? మౌళి ప్రేమకు గుడ్‌బై చెప్పడానికి కారణం ఏంటి?ప్రేమకు నిజ‌మైన అర్థాన్ని మౌళి ఎలా తెలుసుకున్నాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories