తన సినిమాను 20 సార్లు చూసాను అని చెబుతున్న నాని

తన సినిమాను 20 సార్లు చూసాను అని చెబుతున్న నాని
x
Highlights

'భీమిలి కబడ్డీ జట్టు' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన నాచురల్ స్టార్ నాని ఇన్నాళ్ళకు మళ్ళీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' అనే స్పోర్ట్స్ డ్రామా...

'భీమిలి కబడ్డీ జట్టు' అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించిన నాచురల్ స్టార్ నాని ఇన్నాళ్ళకు మళ్ళీ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ' అనే స్పోర్ట్స్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చిత్రీకరణ సహా సినిమా నిర్మాణాంతర పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టిన సినిమా దర్శక నిర్మాతలు ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని తెలియజేశారు. ఏప్రిల్ 12న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కాబోతోందని, ఏప్రిల్ 15న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందని, అనుకున్నట్లుగానే ఈ సినిమా ఏప్రిల్ 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోందని క్లారిటీ ఇచ్చారు దర్శక నిర్మాతలు.

ఈ సినిమా గురించి మాట్లాడుతూ తాను సినిమాలో క్రికెటర్ అర్జున్ పాత్రలో నటించానని, ఆ పాత్ర కోసం ఎంతో శ్రమించి చాలా దెబ్బలు కూడా తగిలించుకున్నానని, ఒకసారి ముక్కు కూడా విరిగింది అని నాని అన్నారు. సినిమాను ఇప్పటికి 20 సార్లు చూశానని, ఫైనల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని, ప్రతి ఎమోషన్, క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన విధానం టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉత్కంఠ కలిగిస్తాయని నాని పేర్కొన్నారు. అంతేకాక ఈ సినిమా లైవ్ క్రికెట్ చూస్తున్న ఫీలింగ్ ను ఇస్తుందని, ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారని కచ్చితంగా చెబుతున్నాడు. సినిమా కోసం కోచింగ్ తీసుకుంటున్న సమయంలో క్రికెట్ గురించి చాలా విషయాలను నేర్చుకున్నాను అని తెలిపిన నాని, 'జెర్సీ' సినిమా తన కెరీర్ లో మోస్ట్ బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మూవీ గా నిలుస్తుందని అంటున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories