Nani: గుండె బరువెక్కింది.. నాని ఎమోషనల్‌ పోస్ట్‌

Nani Emotional Post on Social Media
x

Nani: గుండె బరువెక్కింది.. నాని ఎమోషనల్‌ పోస్ట్‌

Highlights

Nani: గుండె బరువెక్కింది..: నాని ఎమోషనల్‌ పోస్ట్‌

Nani: నటుడు నాని కెరీర్‌లోని సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘జెర్సీ’ఒకటి. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయన క్రికెటర్‌గా నటించారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘జెర్సీ’ స్పెషల్‌ షో వేశారు. దీనికి, నాని-అంజనా దంపతులు హాజరయ్యారు. అభిమానులు చూపిస్తోన్న ఆదరణ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు నాకెంతో భావోద్వేగంగా ఉంది. అభిమానులు ఆదరణ చూస్తుంటే. గుండె బరువెక్కింది. అభిమానుల ప్రేమాభిమానాలతో మనసు నిండిపోయింది’’ అని ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories