Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ మూవీ రివ్యూ... బాలయ్య బాబు సంక్రాంతి రేసులో నిలిచారా?

Daaku Maharaaj Review and Rating in Telugu
x

Daaku Maharaaj Movie Review: డాకు మహారాజ్ మూవీ రివ్యూ

Highlights

Daaku Maharaaj Review and Rating in Telugu: నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా ఊర్వశి మరో కీలకపాత్రలో నటించిన తాజా...

Daaku Maharaaj Review and Rating in Telugu: నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రద్ధ శ్రీనాథ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా ఊర్వశి మరో కీలకపాత్రలో నటించిన తాజా చిత్రం డాకు మహారాజ్. యానిమల్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న బాబి డియోల్ విలన్‌గా నటించిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ముందు నుంచి అంచనాలు పెంచుతూ వచ్చింది. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్యతో కలిసి నాగ వంశీ నిర్మించిన ఈ సినిమాను బాబి కొల్లి డైరెక్ట్ చేశాడు. ఫస్ట్ ట్రైలర్ ప్రేక్షకులలో అంత ఆసక్తి రేకెత్తించకపోయినా రిలీజ్ ట్రైలర్ మాత్రం ఒక్కసారిగా ప్రేక్షకులలో అంచనాలు రేపింది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలోచూద్దాం.

డాకు మహారాజ్ కథ : మదనపల్లెలో టీ ఎస్టేట్ ముసుగులో జంతువుల చర్మం, ఏనుగు దంతాలు స్మగ్లింగ్‌ చేసున్న ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు (రవికిషన్), అతని తమ్ముడు మనోహర్ నాయుడు (సందీప్ రాజ్) బేబీ వైష్ణవిని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పాపను కాపాడేందుకు నానాజీ (నందమూరి బాలకృష్ణ) ఆ ఇంట్లో డ్రైవర్గా చేరుతాడు. అయితే అసలు వైష్ణవి ఎవరు? ఆ చిన్నారిని త్రిమూర్తులు నాయుడు గ్యాంగ్ ఎందుకు చంపాలనుకొంటుంది? వైష్ణవిని నానాజీ జైలు నుంచి తప్పించుకుని వచ్చి మరీ ఎందుకు కాపాడాలనుకొంటాడు. అస్సలు నానాజీ ఎవరు? ఇంజినీర్ సీతా రాం, డాకు మహారాజ్ (నందమూరి బాలకృష్ణ) ఎవరు? బల్వంత్ ఠాకూర్ సింగ్ (బాబీ డియోల్) ఎవరు? డాకు మహారాజ్‌గా మారడానికి అసలు కారణం ఏమిటి? ఈ కథలో నందిని (శ్రద్దా శ్రీనాథ్) పాత్ర ఏమిటి? కావేరి (ప్రగ్యా జైస్వాల్)తో నానాజీకి ఉన్న సంబంధమేమిటి? ఎస్ఐ (ఊర్వేశీ రటేలా) ఏం చేసింది? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

విశ్లేషణ:

ప్రస్తుతం బాలకృష్ణకు గోల్డెన్ పీరియడ్ నడుస్తోంది. సినిమాలు చేస్తున్నా... షోలు చేస్తున్నా అవి సూపర్ హిట్ అవుతున్నాయి. రాజకీయాల్లో కూడా ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాదు ఆయన పార్టీ అధికారంలోకి కూడా వచ్చింది. ప్రస్తుతం హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా కొత్త కథ అయితే కాదు. కానీ నందమూరి ఫ్యాన్స్ మొత్తానికి ఒక రకమైన ఫుల్ మీల్స్ పెట్టేలాంటి కథనంతో ఈ సినిమాని రూపొందించాడు డైరెక్టర్ బాబీ. తెలుగు సినిమా హిట్ ఫార్మాలాను దాటి బయటకు వెళ్లకుండా సేఫ్‌గా కమర్షియల్ హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

బాలకృష్ణ బాడీలాంగ్వేజ్, యాటిట్యూడ్‌కు తగినట్టుగానే డాకు మహారాజ్, సీతారాం క్యారెక్టర్లను రాసుకోవడమే కాదు ఆ ఎమోషన్స్ వర్కౌట్ చేయడం కోసం ఎంచుకున్న నేపథ్యం, బేబీ వైష్ణవి చుట్టూ రాసుకున్న కథతో ప్రేక్షకులను అన్ని రకాలుగా సాటిస్ఫై చేసి బయటకు పంపే ప్రయత్నం చేశాడు. నందమూరి ఫ్యాన్స్‌కు పుల్ మీల్స్ లాంటి సినిమాను అందించడంలో బాబి 100 మార్కులు సంపాదించేసాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వెళ్లిన సగటు ప్రేక్షకుడైతే హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే ఫస్ట్ హాఫ్ ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ సెకండ్ హాఫ్ ఇవ్వదు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో డాకు మహారాజ్‌గా బాలకృష్ణ ఎలివేషన్స్ ఒక రేంజ్‌లో వర్కౌట్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్‌లో మాత్రం అసలు సీతారాం డాకు మహారాజుగా ఎలా రూపాంతరం చెందాడు అనేది చూపించారు.

బేసిక్‌గా మన హ్యమన్ మెంటాలిటీ ప్రకారం ఫైనల్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ కానీ ఆ ప్రోడక్ట్ రెడీ అవ్వడానికి జరిగే ప్రాసెస్ చూడటం అందరికీ కాస్త ఇబ్బందికరమే. ఇక్కడ కూడా అదే ఫార్ములా అప్లై అయింది. అయితే సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్స్‌తో బాగానే వర్కౌట్ అయింది కానీ ఫస్ట్ ఆఫ్ ఉన్నంత కిక్ ఈ సెకండ్ హాఫ్ ఇవ్వదు. క్లైమాక్స్ విషయంలో కూడా మరింత ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బాలయ్య శైలికి భిన్నంగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ ఎప్పటి లానే తనదైన శైలిలో డైలాగ్స్, మాస్ అప్పీల్‌తో ఒకపక్క డాకు మహారాజ్‌గా, సీతారాంగా తన పాత్రల్లో విపరీతమైన వేరియేషన్స్ చూపిస్తూ ఆకట్టుకున్నారు. సరికొత్త గెటప్, దానికి తగినట్ట్లు మేనరిజంతో అభిమానలనే కాదు సగటు ప్రేక్షకులను సైతం ఈలలు వేయించే ప్రయత్నం చేశారు. ఇక యానిమల్ తర్వాత బాబీ డియోల్ మరోసారి అలాంటి ఒక క్రూరమైన పాత్రలో ఒక రేంజిలో పర్ఫామెన్స్ ఇచ్చాడు. నందినిగా శ్రద్దా శ్రీనాథ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో తన మార్క్ చూపించింది. కథలో కీలకంగా, స్టోరీని ముందుకు నడిపించే పాత్రతో తనదైన శైలిలో నటించి ఆకట్టుకుంది. ప్రగ్యా జైస్వాల్ పాత్ర చిన్నదైనా ఉన్నంతలో పర్వాలేదు.

ఎస్‌ఐగా ఊర్వశి రౌటేలా నటనపరంగానే కాకుండా గ్లామర్ పరంగా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ అందించేసింది. ఇక చాందినీ చౌదరీ, సచిన్ కేడ్కర్, రిషి, రవి కిషన్, వంటి ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫి, మ్యూజిక్, ఫైట్స్ ఈ సినిమాకు ప్రధానమైన ఆకర్షణలు అని చెప్పొచ్చు. ఇప్పటికే తమన్ అందించిన మ్యూజిక్ గురించి మీ అందరికీ తెలుసు కానీ తమన్ బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది. ఇంట్రడక్షన్ సీన్స్ మొదలు బాలకృష్ణ కనిపించిన ప్రతిసారి ఒక రేంజ్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. విజయ్ కార్తీక్ షూట్ చేసిన సన్నివేశాలు సినిమాను మంచి కంటెంట్తో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాయి. నాగవంశీ, సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

హెచ్ఎంటీవీ వర్డిక్ట్ : నందమూరి ఫ్యాన్స్‌కు డాకు మహారాజ్ సినిమా ఫుల్ మీల్స్.. సగటు ప్రేక్షకుడు కొత్తదనం ఆశించకుండా వెళితే ఈ సినిమా నిరాశ పరచదు.

Show Full Article
Print Article
Next Story
More Stories