Namrata Shirodkar: జిమ్ లో నమ్రత కసరత్తులు... రీఎంట్రీకేనా..?

Namrata Shirodkar Gym Video Goes Viral On Social Media
x

Namrata Shirodkar: జిమ్ లో నమ్రత కసరత్తులు...రీఎంట్రీకేనా..?

Highlights

Namrata Shirodkar: సదరు వీడియోలో జిమ్ ట్రైనర్ కుమార్ మన్నవ పర్యవేక్షణలో నమత్ర కసరత్తులు చేస్తున్నారు.

Namrata Shirodkar: వయసుతో సంబంధం లేకుండా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అర్థాంగి నమత్రా శిరోద్కర్ సైతం అతీతం కాదు. ఏజ్ 50 ప్లస్ అయినా నమత్ర స్లిమ్ అండ్ ఫిట్ బాడీని మెయింటేన్ చేస్తున్నారు. ఆరోగ్యం పై ఆమెకు ఉన్న శ్రద్ధే.. నమ్రతను ఫిట్ గా ఉంచుతుంది. చక్కటి ఆహారాన్ని తీసుకోవడంతో పాటు చెమటలు చిందించే వ్యాయామాలను సైతం నమత్ర క్రమం తప్పకుండా చేస్తారు. తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని సూపర్ స్టార్ వైఫ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

సదరు వీడియోలో జిమ్ ట్రైనర్ కుమార్ మన్నవ పర్యవేక్షణలో నమత్ర కసరత్తులు చేస్తున్నారు. గతంలో చేయని పుల్ అప్స్ , స్విస్ బాల్ ప్లాంక్, రోల్ అవుట్ ఎక్సర్ సైజులను తన జిమ్ ట్రైనర్ ఎంతో సహనంగా చేయించారని నమత్ర తన వీడియో పోస్ట్ లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా... నమత్ర బ్యూటీ సీక్రెట్ ఇదా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక కొంతమంది అయితే నమత్ర రీఎంట్రీకి రెడీ ఔతున్నారా ఏంటి అని కొంటెగా ప్రశ్నిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories