Nagarjuna: ప్రధాని మోడీకి నాగార్జున కృతజ్ఞతలు.. ఎందుకంటే..?

Nagarjuna, Naga Chaitanya and Sobhita Thank PM Modi for Akkineni Nageswara Rao Tribute
x

Nagarjuna: మోదీకి నాగార్జున కృతజ్ఞతలు.. ఎందుకంటే..?

Highlights

ప్రధాని నరేంద్ర మోడీకి టాలీవుడ్ హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావును ప్రస్తావించడంపై స్పందించారు.

ప్రధాని నరేంద్ర మోడీకి టాలీవుడ్ హీరో నాగార్జున ధన్యవాదాలు తెలిపారు. మన్ కీ బాత్ లో అక్కినేని నాగేశ్వరరావును ప్రస్తావించడంపై స్పందించారు. తన తండ్రి శతజయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్నందుకు ప్రత్యేక క‌కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.

ఐకానిక్ లెజెండ్స్‌తో పాటు అక్కినేని నాగేశ్వరావు శత జయంతిని గౌరవించడం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు. ఏఎన్నార్ దూరదృష్టి, ఇండియన్ సినిమాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు.

మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పలు విషయాలను పంచుకుంటూ ఉంటారు. డిసెంబర్ 29న అక్కినేని నాగేశ్వరరావు, బాలీవుడ్ డైరెక్టర్ తపన్ సిన్హా, రాజ్ కపూర్‌ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ వారిని ప్రశంసించారు.

2024 తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు గారి అమూల్యమైన సేవల్ని ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు.

అక్కినేని నాగేశ్వరరావు తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని ఆయన కొనియాడారు. ఆయన సినిమాల్లో భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువలను అక్కినేని సినిమాల్లో ఉండేవని ఆయన గుర్తు చేశారు.

ఇక మోడీ వ్యాఖ్యలపై అక్కినేని నాగచైతన్య, శోభిత దంపతులు స్పందించారు. ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అక్కినేని నాగేశ్వరరావు కళా నైపుణ్యాన్ని, తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని మీరు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది. మీ నుంచి ప్రశంసలు పొందడం మీ అదృష్టం. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ నాగ చైతన్య, శోభిత ట్వీట్ చేశారు.

ఏఎన్‌ఆర్ తన సినీ కెరీర్‌లో తెలుగు సినిమా వృద్ధి, విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక బ్లాక్ బస్టర్‌లను అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించడం ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories