Nagaon Police Message To Prabhas: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ కరోనాని నియంత్రించడానికి వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు.
Nagaon Police Message To Prabhas: దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఈ కరోనాని నియంత్రించడానికి వ్యక్తిగత శుభ్రత ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అందులో భాగంగా మాస్క్ లు అయితే తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. ఇక అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బయటకు వస్తే కచ్చితంగా మాస్క్ లు ధరించాలని చెబుతున్నాయి. అంతేకాకుండా కఠినంగా ఫైన్లు కూడా విధిస్తున్నాయి. తాజాగా ఇది కాస్త ఈ రోజు విడుదలైన ప్రభాస్- పూజా హెగ్డే రొమాంటిక్ స్టిల్‌ని కూడా తాకింది. ఈ స్టిల్ పైన పోలీసులు సోషల్ మీడియాలో ప్రభాస్ కి ఓ సందేశాన్ని కూడా పంపారు.
ఇంతకి ఏం జరిగింది అంటే?
జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ 20 వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ , కం టైటిల్ ని ఈ రోజు అనౌన్స్ చేసింది చిత్రబృందం.. ఈ సినిమాకి 'రాధే శ్యామ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ , పూజా హేగ్దే రొమాంటిక్ స్టిల్ కి ఫోజ్ ఇచ్చారు. ఈ పోస్టర్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది కాస్తా అస్సాంలోని నాగాన్ పోలీసుల కంట పడింది. దీనితో వారు ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయ్యారు.
''మీ ప్రియమైన వారు బయటకు వచ్చినప్పుడల్లా మాస్క్ పెట్టుకోమని చెప్పండి. మేము ప్రభాస్‌కి చెప్పడానికి ప్రయత్నించాం.. కానీ విఫలమయ్యాం. అందుకే ఇలా ఫోటోషాప్ ద్వారా ఎడిట్ చేసి ఈ పోస్టర్ ద్వారా సందేశం పంపుతున్నాం'' అంటూ సరదాగా ఓ ట్వీట్ పెట్టారు నాగాన్ పోలీసులు. అయితే పోలీసులు ఈ పోస్టర్ లో ప్రభాస్- పూజా హెగ్డేలకి మాస్క్ లు పెట్టడం విశేషం.. ఇది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటు నెటిజన్లు కూడా పోలిసుల ప్రతిభను మెచ్చుకుంటున్నారు.
ట్విట్టర్ లో 'రాధే శ్యామ్' ట్రెండ్
ప్రభాస్ 20వ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురుచూస్తూ వస్తున్నారు. ఈ రోజు సినిమా నుంచి ఫస్ట్ లుక్ రావడంతో ట్విట్టర్ లో 'రాధే శ్యామ్' ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాని గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా కనిపించనుంది. సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, మురళీ శర్మ, సాషా ఛేత్రి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పూర్వ జన్మల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది.
Ask your loved ones to put Mask whenever they are out.
— Nagaon Police (@nagaonpolice) July 10, 2020
We tried calling Prabhas but failed.
Now sending the message through photoshop.@TSeries @UV_Creations @hegdepooja @director_radhaa @assampolice#RadheShyam #Prabhas20 pic.twitter.com/WNyOSzklVC
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire