మాది లవ్ హేట్ రిలేషన్షిప్ అంటున్న నాగచైతన్య

మాది లవ్ హేట్ రిలేషన్షిప్ అంటున్న నాగచైతన్య
x
Highlights

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో నాగచైతన్య సమంత ల జంట కూడా ఒకటి. ఇప్పటికే 'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' వంటి సినిమాలలో తమ కెమిస్ట్రీ తో...

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో నాగచైతన్య సమంత ల జంట కూడా ఒకటి. ఇప్పటికే 'ఏ మాయ చేసావే', 'మనం', 'ఆటోనగర్ సూర్య' వంటి సినిమాలలో తమ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మెప్పించిన సామ్, చై పెళ్లయిన తర్వాత మొట్టమొదటి సారిగా 'మజిలీ' అనే సినిమా తో మరొక హిట్ ను అందుకున్నారు. ఇదిలా ఉండగా ఈ మధ్యనే నాగచైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సమంత తో తన అనుబంధం గురించి చెప్పాడు. వారిది లవ్ హేట్ రిలేషన్షిప్ అని అంటున్నాడు నాగచైతన్య.

"తను నన్ను ఎప్పుడు ఎడిపిస్తూ ఉంటుంది. నేను నిన్ను ఎనిమిదేళ్లుగా ప్రేమిస్తున్నాను అప్పటి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్తూ ఉంటుంది కానీ నాకు తెలీదు. మేము 'ఏ మాయ చేసావే' సమయం నుంచి మంచి ఫ్రెండ్స్. తను నన్ను ద్వేషించింది, ప్రేమించింది. నేను తనని ద్వేషించినాను ప్రేమించాను. మాది లవ్ హేట్ రిలేషన్షిప్" అని చెప్పుకొచ్చాడు నాగచైతన్య. ఇక సినిమాల పరంగా చూస్తే సమంత నటించిన 'ఓ బేబీ' సినిమా త్వరలో విడుదల కానుంది. మరోవైపు నాగచైతన్య విక్టరీ వెంకటేష్ తో కలిసి నటిస్తున్న 'వెంకీ మామ' సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories