సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ శుభలేఖ

Naga Chaitanya Wedding Card
x

Naga Chaitanya Wedding Card

Highlights

Naga Chaitanya Wedding Card: అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఇటీవలె ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభిత డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

Naga Chaitanya Wedding Card: అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఇటీవలె ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభిత డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్య, శోభిత వివాహ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో రాత్రి 8.13 నిమిషాలకు వీరి వివాహం జరగనుంది. ప్రముఖులు, బంధువులు, సన్నిహితులకు వెడ్డింగ్ కార్డులు పంపుతున్నట్టు సమాచారం. 2 రోజుల క్రితం శోభితా ధూళిపాళ్ళ శుభలేఖ సోషల్ మీడియాను షేక్ చేసింది. శోభిత పేరు ముందు ఉండి చైతన్య పేరు వెనుక ఉండడంతో అది పెళ్లి కూతురు తరపున శుభలేఖ అని తెలుస్తోంది. అందులో వధువు పేరు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శోభితతో చిరంజీవి నాగ చైతన్య వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది అని రాసి ఉంది.

ఇక ఇప్పుడు పెళ్లి కొడుకు తరపున శుభలేఖలో మాత్రం శోభిత పేరు మారింది. అక్కినేని నాగేశ్వరరావు-అన్నపూర్ణ.. దగ్గుబాటి రామానాయుడు-రాజేశ్వరి మనవడు అయిన నాగ చైతన్యకు ధూళిపాళ్ల శాంత కామక్షీ-వేణుగోపాల్ రావు కుమార్తె అయిన లక్ష్మీ శోభితతో డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహం జరగనుంది అని రాసి ఉంది. మరోవైపు కార్డు చివరిలో తన తల్లి లక్ష్మీ ఆమె భర్త శరత్ పేరుతో పాటు నాన్న నాగార్జున, అమల పేర్లు ఆహ్వానిస్తున్నట్టు ఈ పెళ్లి కార్డులో ఉండడం విశేషం. శోభిత పూర్తి పేరు లక్ష్మీ శోభిత అన్న విషయం ఎవరికీ తెలియదు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత కూడా శోభిత హీరోయిన్‌గా కెరీర్ కంటిన్యూ చేస్తారా? లేకపోతే ఇంటికే పరిమితం అవుతారా అని సోషల్ మీడియాలో నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. మరోవైపు అక్కినేని ఫ్యాన్స్‌ ఈ కాబోయే జంటకు ఆల్ ది బెస్ట్ చెబుతుండటం కూడా కనిపిస్తోంది.

నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్ధరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అంతేకాదు ఎవరి లైఫ్‌ను వారు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. ఆ తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో పెద్దల సమక్షంలో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక డిసెంబర్ 4న వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు.

ఇక చైతన్య సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన తండేల్ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories