కరోనా సమయంలో ఊపిరాడక ఇబ్బందిపడ్డా : నాగబాబు

కరోనా సమయంలో ఊపిరాడక ఇబ్బందిపడ్డా : నాగబాబు
x
Highlights

కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వనికిస్తుంది. అయితే ఈ ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా మంది నటులు కరోనా బారిన పడి కోలుకున్నారు.

కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వనికిస్తుంది. అయితే ఈ ప్రభావం ఎక్కువగా సినీ ఇండస్ట్రీ పైన ఉందని చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా మంది నటులు కరోనా బారిన పడి కోలుకున్నారు. అందులో భాగంగానే నటుడు నాగబాబు కూడా కరోనా బారిన పడిన కోలుకున్న సంగతి తెలిసిందే.. అయితే కరోనా సమయంలో తానూ ఎదురుకున్న సమస్యల గురించి నాగబాబు తాజాగా వెల్లడించారు.

కరోనా సోకింది అని తెలియగానే ముందుగా చాలా కంగారు పడ్డాననని అన్నారు నాగబాబు.. ఎందుకంటే ఆస్తమా సమస్య ఉన్న కారణంతో తానూ చికిత్స కోసం వెంటనే ఆసుపత్రిలో చేరినట్టుగా నాగబాబు వెల్లడించారు. మొదట్లో కొన్నిసార్లు ఊపిరాడక ఇబ్బందిపడ్డానని తెలిపారు. మూడో రోజు వాసన కోల్పోయానని, ఆ తర్వాత వైద్యుల సలహాల మేరకు చికిత్స తీసుకొని మామలు స్థితికి చేరుకున్నట్టుగా నాగబాబు చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత వైద్యులు డిశ్చార్జ్ చేయడంతో తానూ ఇంటికి వచ్చి మరో వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉన్నట్టుగా నాగబాబు వెల్లడించారు. అయితే తానూ ఇంటికి వచ్చే సమయానికి తన భార్య పద్మజకి కూడా కరోనా సోకిందని, ఇద్దరం కలిసి వారం రోజుల పాటు స్వీయ నిర్బంధంలోనే ఉండాల్సి వచ్చిందని నాగబాబు పేర్కొన్నారు. ఇక తన భార్య ఆరోగ్యవంతురాలు కాబట్టి త్వరగా కోలుకుందని, తానూ కోలుకోవడానికి కొద్ది సమయం పట్టిందని వెల్లడించారు.

ఈ సందర్బంగా నాగబాబు స్వల్ప లక్షణాలు కనిపించిన సరే కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. కరోనాతో మీ శరీరం పోరాటం చేయగలదేమో కానీ మీ పక్కనే ఉండే కొంతమంది దాన్ని తట్టుకోలేకపోవచ్చు. చాలా అప్రమత్తంగా ఉండాలని నాగబాబు వాఖ్యానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories