N Convention Centre: నాగార్జునకు సంతోషం లేకుండా చేసిన బర్త్ డే

N Convention Centre: నాగార్జునకు సంతోషం లేకుండా చేసిన బర్త్ డే
x
Highlights

ఆగస్టు 29 నాగార్జున బర్త్ డే. గ్రాండ్ సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతున్న అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున పుట్టిన రోజు వేడుకలకు 5 రోజుల ముందే ఊహించని షాక్.

Nagarjuna and AV Ranganath About N Convention Centre: స్టార్ హీరోల బర్త్ డే వేడుకలు అంటే మామూలు హంగామా ఉండదు. అందులోనూ అదే ఏడాది ఆ స్టార్ హీరో ఇంట్లో ఏదైనా గుడ్ న్యూస్ ఉందంటే.. ఆ ఏడాది బర్త్ డే సెలబ్రేషన్స్ ఇంకా ఓ రేంజ్‌లో ఉంటాయి. నాగ్ బర్త్ డేకి మరో 5 రోజులే మిగిలి ఉంది. ఔను.. ఆగస్టు 29 నాగార్జున బర్త్ డే. ఈసారి నాగార్జున బర్త్ డే వేడుక కూడా అలాగే ఉంటుందని నాగ్ ఫ్యాన్స్ ఆశించారు. ఎందుకంటే ఈమధ్యే నాగచైతన్యకు, శోభిత దూళిపాళ్లకు ఎంగేజ్మెంట్ జరిగింది. త్వరలోనే వీళ్ల పెళ్లి కూడా జరగనుంది. నాగ చైతన్య, సమంత డైవర్స్ తీసుకుని విడిపోయిన తరువాత మళ్లీ ఆ ఇంట్లో జరుగుతున్న శుభకార్యం ఇది. అలా ఈ ఇంట్లోకి మరో కొత్త కోడలు వచ్చి చేరుతున్న తరుణంలో జరుగుతున్న బర్త్ డే వేడుకలు కూడా కావడంతో ఆ సెలబ్రేషన్స్ ఎప్పటికంటే ఇంకాస్త ఘనంగా జరగడం అనేది ఎవరి విషయంలోనైనా సహజంగానే జరిగేదే.

అక్కినేని కుటుంబం మొత్తం నాగార్జున బర్త్ డే సెలబ్రేషన్స్‌కి రెడీ అవుతున్న తరుణంలోనే ఆ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. హైడ్రా అధికారులు టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్, రెవిన్యూ శాఖల అధికారులతో కలిసి వెళ్లి భారీ బందోబస్తు మధ్య మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేశారు. పక్కనే ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3.30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని హైడ్రా ఆరోపిస్తోంది. అందులో ఎఫ్‌టిఎల్ పరిధిలో 1 ఎకరం 12 గుంటలు, బఫర్ జోన్‌లో 2 ఎకరాల 18 గుంటలు స్థలాన్ని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టింది అని రంగనాథ్ స్పష్టంచేశారు.

ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో నాగార్జున మాత్రమే కాకుండా ఆ కుటుంబం మొత్తం ఒక్కసారిగా షాక్‌కి గురైంది. ఎందుకంటే ఇది ఆ కుటుంబానికి సంబంధించిన పరువు, ప్రతిష్టల విషయం. పైగా ఆ స్థలం చెరువు స్థలం కాదు.. పట్టా భూమి అని నాగ్ చెబుతున్నాడు. అందుకే హైడ్రా నిర్ణయాన్ని సవాలు చేస్తూ నాగ్ హై కోర్టుకు వెళ్లారు. ఈ నిర్మాణం సక్రమం అని నాగ్ నిరూపించుకోలేకపోతే, హైడ్రా ఆరోపించినట్లుగా నాగ్ నిజంగానే ఆ స్థలాన్ని కబ్జా చేశారా అనే మెసేజ్ జనంలోకి వెళ్తుంది. అందుకే నాగ్ ముందు ప్రస్తుతం అతి పెద్ద లీగల్ ఛాలెంజ్ ఉంది.

నాగ్ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించిన తరువాత, హై కోర్టు నుండి మధ్యంతర స్టే తెచ్చుకున్న తరువాత కూడా హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ప్రెస్ రిలీజ్ ద్వారా తమ నిర్ణయం సరైనదేనని స్పష్టంచేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం వ్యవస్థల్ని మ్యానిపులేట్ చేస్తూ అక్రమ నిర్మాణాల్లో బిజినెస్ చేసుకుంటున్నట్లుగా తన ప్రెస్ రిలీజ్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ రోజు మధ్యాహ్నం ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలపై హై కోర్టు మధ్యంతర స్టే ఆర్డర్ ఇచ్చింది కానీ అంతకు ముందు ఏ కోర్టు కూడా వారికి స్టే ఆర్డర్ ఇవ్వలేదని రంగనాథ్ తేల్చిచెప్పారు.

రంగనాథ్ చెప్పినదాని ప్రకారం నాగ్ ఇచ్చిన స్టేట్మెంట్ తప్పా ? లేక నాగ్ కరెక్టుగా ఉండటం వల్లే న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారా ? ఇందులో ఏది నిజం.. ? ఇలా నాగ్ చెప్పిన విషయానికి రంగనాథ్ ఇచ్చిన కౌంటర్ మళ్లీ నాగ్ వైపే జనం పలు ప్రశ్నలు సంధించేలా చేసింది. మొత్తానికి ఈ తలనొప్పికి పరిష్కారం ఏంటో కనుగునే పనుల్లో, లీగల్ కన్సల్టేషన్స్‌తో నాగ్ బిజీగా ఉన్నాడు. అలా ఈసారి నాగార్జున బర్త్ డేకు ఆయనకు అంత ప్రశాంతత లేకుండాపోయిందనే టాక్ వినిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories