Amitabh Bachchan Tweets From Hospital: మీ హ‌ద్దులు లేని అభిమానానికి నా కృత‌జ్ఞత‌లు!

Amitabh Bachchan Tweets From Hospital: మీ హ‌ద్దులు లేని అభిమానానికి నా కృత‌జ్ఞత‌లు!
x
Amitabh Bachchan (File Photo)
Highlights

Amitabh Bachchan Tweets From Hospital: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. చిన్నా, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సోకి అందరిని భయబ్రాంతులకి గురి చేస్తోంది.

Amitabh Bachchan Tweets From Hospital: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎవరిని వదలడం లేదు. చిన్నా, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి సోకి అందరిని భయబ్రాంతులకి గురి చేస్తోంది. ఇక బాలీవుడ్ పైన కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇప్పటికే బాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.

అయనతో పాటుగా ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ , కోడలు ఐశ్వర్య రాయ్ బచ్చన్, మనవరాలు ఆధ్య (అభిషేక్, ఐశ్వర్య దంపతుల కూతురు) కూడా కరోనా సోకింది. ఇక మిగిలిన కుటుంబ సభ్యులు.. జయ బచ్చన్, శ్వేతా బచ్చన్ నందా , ఆమె పిల్లలు అగస్త్య , నవ్య నవేలి నివేదికలు మాత్రం నెగటివ్ అని వచ్చాయి. అయితే బిగ్ బీ కుటుంబంలో నలుగురికి కరోనా రావడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయన త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీతో పాటుగా అభిమానులు దేవుడిని కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో అమితాబ్ గురువారం రాత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. " తన ఆరోగ్యం, తన కుమారుడి ఆరోగ్యం బాగుపడాలని మీరు చూపిన ప్రేమ‌, ఆశీర్వాదాలు, ప్రార్థన‌ల‌న్నింటినీ నేను చూశాను. మీ హ‌ద్దులు లేని అభిమానానికి నా కృత‌జ్ఞత‌లు. ఇక్కడ ఆసుపత్రిలో నిబంధనలు చాలా క‌ఠినంగా ఉన్నాయి. అయితే అవి కేవలం మా ఆరోగ్యం కోసం మాత్రమే.. నేను ఇంతకన్నా ఎం చెప్పలేను .. ప్రేమతో " అని అమితాబ్ ట్వీట్ చేశారు.


ఇక ప్రస్తుతం బిగ్ బీ ముంబైలోని ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకి చికిత్స అందిస్తున్న వైద్యులు అయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories