145 నిమిషాల నిడివి.. ఒంటరిగా చూస్తే భయపడాల్సిందే.. ఊహించని ట్విస్ట్‌లతో దడ పుట్టిస్తోన్న సైకో థ్రిల్లర్ సినిమా..!

Must Watch Psychological Thriller Movie Dushman for Ashutosh Rana Action Kajol and Sanjay Dutt
x

145 నిమిషాల నిడివి.. ఒంటరిగా చూస్తే భయపడాల్సిందే.. ఊహించని ట్విస్ట్‌లతో దడ పుట్టిస్తోన్న సైకో థ్రిల్లర్ సినిమా..!

Highlights

Psychological Thriller Film: చాలా చిత్రాలలో కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. వీటిలో కొన్ని బలంగా, మరికొన్ని ప్రమాదకరంగానూ ఉంటాయి.

Must Watch Psychological Thriller Film: చాలా చిత్రాలలో కొన్ని పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతుంటాయి. వీటిలో కొన్ని బలంగా, మరికొన్ని ప్రమాదకరంగానూ ఉంటాయి. కొన్ని పాత్రలు భయపెడితే, మరికొన్ని నవ్విస్తుంటాయి. అయితే, నవ్వించే పాత్రల కంటే, నిద్రలేని రాత్రులను చూపించే పాత్రలు నిజ జీవితంలోనూ వెంటాడుతుంటాయి. ఇలాంటి సినిమా ఒకటి 26 ఏళ్ల క్రితం విడుదలైంది. ఈ సినిమాలో ఇద్దరు సూపర్‌స్టార్లు ఉన్నారు. ఇది సైకోథ్రిల్లర్ సినిమా. ఈ సినిమా చూడాలంటే కచ్చితంగా ధైర్యం చేయాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిలకైతే ఈ సినిమా దడ పుట్టిస్తోంది.

ఈ చిత్రం 1998లో విడుదలైంది. 145 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా పగటిపూట కూడా చూడాలంటే ఒళ్లు జలదరించాల్సిందే. రాత్రి ఒంటరిగా వెళ్లేందుకు భయపడుతుంటారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విడుదలైన వెంటనే నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

'దుష్మన్'లో సంజయ్ దత్, కాజోల్ నటించారు. అయితే, ఈ సినిమాలో అత్యంత భయకరమైన విలన్ కూడా ఉన్నాడు. ఈ సైకలాజికల్ చిత్రంలో అశుతోష్ రానా భయంకరమైన విలన్ పాత్రను పోషించాడు. అశుతోష్ ఈ చిత్రంలో గోకుల్ పండిట్ పాత్రను పోషించాడు. ఈ పాత్ర కనిపిస్తేనే ప్రేక్షకులు భయపడుతుంటారు.

ఈ చిత్రంలో సంజయ్ దత్ కాజోల్‌తో ప్రేమలో పడే అంధుడిగా నటించాడు. కాజోల్‌ ద్విపాత్రాభినయంలో కనిపిస్తుంది. ఒకపాత్ర విలన్ చేతిలో హత్యకు గురవుతుంది. ఆ దృశ్యాన్ని చూస్తే.. మన కళ్లను మనం నమ్మలేం. కాజోల్ తన సోదరి హంతకుడిని కనుగొంటుంది. ఆ తర్వాత కథలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఒక్క క్షణం కూడా సీట్లో కూర్చోనివ్వదు.

ఈ సినిమాలో గోకుల్ పండిట్ లుక్, నడక, మాట్లాడే విధానం అన్నీ భయపెడుతుంటాయి. అశుతోష్ ఈ పాత్రలో జీవించాడు. అతను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ విలన్ అవార్డును కూడా పొందాడు. ఈ సినిమాకి తనూజా చంద్ర దర్శకత్వం వహించారు. ముఖేష్ భట్, పూజా భట్ ఈ సినిమాను నిర్మించారు.

అంతే కాదు ఈ సినిమాలో హీరో పాత్ర కంటే విలన్ పాత్రకే ప్రాధాన్యత పెరిగింది. ఈ సినిమా చూశాక జనాల మనసుల్లో ఒక్క పేరు మాత్రమే నిలిచిపోయింది. అది గోకుల్ పండిట్. మీరు ఈ సినిమాని యూట్యూబ్‌లో ఉచితంగా చూడవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories