కొమురంభీమ్‌కు టోపీ పెడతావా.. మరి వాళ్ళకి పెట్టగలవా?

కొమురంభీమ్‌కు టోపీ పెడతావా.. మరి వాళ్ళకి పెట్టగలవా?
x
Highlights

త్రిబుల్‌ ఆర్‌ సినిమాపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో కొమురంభీమ్‌కు టోపీ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగలబెడతామని హెచ్చరించారు

త్రిబుల్‌ ఆర్‌ సినిమాపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలో కొమురంభీమ్‌కు టోపీ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా విడుదల చేస్తే థియేటర్లను తగలబెడతామని హెచ్చరించారు. ఒవైసీకి బొట్టుపెట్టి కాషాయ కండువా కప్పుతారా..?... నిజాం ఫోటోకు బొట్టు పెట్టి దండ వేయగలరా..? అంటూ ప్రశ్నించారు. కొమురంభీమ్‌కు టోపీ పెట్టడంపై ఆదివాసీ గిరిజనులు ఆగ్రహంతో ఉన్నారన్న ఆయన.. కొమురంభీమ్‌ మనవడు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారన్నారు. అభ్యంతరకర సన్నివేశాలు తొలగించకపోతే సినిమా విడుదల కానివ్వమంటూ హెచ్చరించారు.

అటు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు బండి సంజయ్.. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని అన్నారు. మూర్కత్వపు ముఖ్యమంత్రి కులాలు, వర్గాలతో ప్రజలను విడదీస్తూన్నారని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేయటం లేదు అంటూ విమర్శలు చేశారు సంజయ్.. తెలంగాణాకు విమోచనానికి కారణమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఈరోజు సీఎం కేసీఆర్ కనీసం నివాళులు కూడా అర్పించలేదని అన్నారు.. దుబ్బాక లో టీఆర్ఎస్ గెలవడం కేసీఆర్ కి ఇష్టంలేదని, దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావు అడ్డు తొలుగుతుంది. దుబ్బాకలో ఓడిన తెల్లారి కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడని సంజయ్ అన్నారు. మొలతాడు లేని ఓవైసీ కి కేసీఆర్ భయపడుతున్నారని సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

అటు కేసీఆర్ సవాల్ పైన బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా.. రాలేదంటూ ఝూటా మాటలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు కేంద్రం నిధుల విడుదలపై చర్చకు రావాలంటూ ప్రతి సవాల్‌ విసిరారు. ఒకవేళ నిధులు విడుదల చేయలేదని నిరూపిస్తే దుబ్బాక చౌరస్తాలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటానని కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories