Mohan Babu: అజ్ఞాతంలో లేను.. ఇంట్లోనే ఉన్నా..

Mohan Babu Says Anticipatory Bail NOT Rejected
x

Mohan Babu: అజ్ఞాతంలో లేను.. ఇంట్లోనే ఉన్నా..

Highlights

Mohan Babu: తాను అజ్ఞాతంలో ఉన్నట్టు వస్తున్న వార్తలపై సినీ నటుడు మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందించారు.

Mohan Babu: తాను అజ్ఞాతంలో ఉన్నట్టు వస్తున్న వార్తలపై సినీ నటుడు మోహన్ బాబు ఎక్స్ వేదికగా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నానని తెలిపారు. నిజాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తప్పుడు వార్తలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.

జల్‌పల్లిలో మోహన్ బాబుకు కుమారుడు మనోజ్ మధ్య వివాదం జరిగింది. దాన్ని కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డారు. దీంతో రంజిత్ అనే జర్నలిస్టుకు తీవ్రగాయాలయ్యాయి. మోహన్ బాబు తీరుపై జర్నలిస్టులు నిరసనలు వ్యక్తం చేశారు. రంజిత్ ఫిర్యాదు మేరకు రాచకొండ పోలీసులు మోహన్ బాబుపై హత్యాయత్నంతో పాటు పలు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోరుతూ మోహన్ బాబు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారంటూ ప్రచారం సాగింది.దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు.


Show Full Article
Print Article
Next Story
More Stories