సినిమాని మించిన ఎమ్మెల్యే రోజా, సెల్వమణి లవ్ స్టోరీ

సినిమాని  మించిన ఎమ్మెల్యే రోజా, సెల్వమణి లవ్ స్టోరీ
x
Highlights

ఓ రోజు ‘సీతారత్నంగారి అబ్బాయి’ షూటింగ్‌ టైమ్‌లో నా దగ్గరకి వచ్చి.. ‘ఐ లవ్‌ యూ. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారని సెల్వమణి చెప్పినట్టుగా రోజా వెల్లడించింది..

చాలా తక్కువ కాలంలో వందకి పైగా సినిమాల్లో నటించి నటిగా మంచి పేరు సంపాదించుకుంది రోజా.. ఇక అంతకుమించి రాజకీయాల్లోనూ దూసుకుపోతున్నారు ఆమె.. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా రోజా కొనసాగుతున్నారు.. రాజకీయాల్లోకి ఆమెకి ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా ఉంది.. ఇక ఇది ఇలా ఉంటే రోజా తమిళ దర్శకుడు సెల్వమణిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే..

అయితే ఇందులో ఎవరు ఎవరికీ ముందుగా ప్రపోజ్ చేశారన్నది ఎవరికీ తెలియదు.. తాజాగా ఈ విషయాన్ని రోజా వెల్లడించింది.. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఓ షోలో భాగంగా ఆనాటి తన ప్రేమ సంగతులను గుర్తు చేసుకున్నారు రోజా.. షోలో భాగంగా రోజా-సెల్వమణి ప్రేమకథను స్టేజ్‌పై ఆవిష్కరించడంతో తన ప్రేమ సంగతులను గుర్తు చేసుకున్న రోజా.. తన భర్త సెల్వమణి డైరెక్ట్‌గా తనకు ప్రపోజ్‌ చేయలేదని, ముందుగా తమ ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఆ తర్వాత తన వద్దకి వచ్చి ప్రేమ విషయాన్ని వ్యక్తపరిచారని రోజా చెప్పుకొచ్చారు..

ఓ రోజు 'సీతారత్నంగారి అబ్బాయి' షూటింగ్‌ టైమ్‌లో నా దగ్గరకి వచ్చి.. 'ఐ లవ్‌ యూ. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారని సెల్వమణి చెప్పినట్టుగా రోజా వెల్లడించింది.. ఇక రోజా, సెల్వమణి 2002లో పెళ్లి చేసుకోగా, వీరికి ఇద్దరు సంతానం. ఓ అమ్మాయి, అబ్బాయి ఉన్నారు.. ఓ వైపు సినిమా రంగంతో పాటు మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగానే ఉంటున్నారు రోజా..

Show Full Article
Print Article
Next Story
More Stories