మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్.!

మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్.!
x
Highlights

మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ప్రకటించారు. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య షూటింగ్ కోసం సిద్ధం అవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారు చిరంజీవి. దాన్లో ఆయనకు పాజిటివ్ గా తేలింది. దీంతో అయన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

''ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని,కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటివ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు లేవు.వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను.గత 4-5 రోజులుగా నన్ను కలిసినవారందరిని టెస్ట్ చేయించుకోవాలిసిందిగా కోరుతున్నాను.ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని మీకు తెలియచేస్తాను.'' అంటూ ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories