చిరు గొప్ప మనసు.. పేదరోగులకు ఉచితంగా కోవిడ్ ప్లాస్మా!

చిరు గొప్ప మనసు.. పేదరోగులకు ఉచితంగా కోవిడ్ ప్లాస్మా!
x

Chiranjeevi 

Highlights

Megastar Chiranjeevi : కేవలం ఓ నటుడు గానే కాకుండా మానవతవాదిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ఎవరైనా కష్టాల్లో ఉన్న ఆప‌ద‌లో ఉన్న సరే వారికి త‌నవంతు సాయం అందిస్తుంటారు చిరు.. ఇప్పటికే అయన బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లను ఏర్పాటు చేసి చాలా సేవలని అందిస్తున్నారు.

Megastar Chiranjeevi : కేవలం ఓ నటుడు గానే కాకుండా మానవతవాదిగా గొప్ప పేరు సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.. ఎవరైనా కష్టాల్లో ఉన్న ఆప‌ద‌లో ఉన్న సరే వారికి త‌నవంతు సాయం అందిస్తుంటారు చిరు.. ఇప్పటికే అయన బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లను ఏర్పాటు చేసి చాలా సేవలని అందిస్తున్నారు. తాజాగా అయన క‌రోనా రోగుల‌కు ఉచితంగా ప్లాస్మా విత‌ర‌ణ చేయాల‌ని నిర్ణయం తీసుకున్నారు. కరోనా బారిన పది నిస్సహాయులైన పేద రోగులకు ఉచిత ప్లాస్మా ను తన బ్లడ్ బ్యాంకు ద్వారా వితరణ చేసేందుకు చిరు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

"పచ్చటి జీవితాలపై కర్మశ కరోనా పంజా విసుర్లూ చిన్నాభిన్నం చేస్తోంది. అందులో పేద రోగులు చికిత్స పొందడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో పేద రోగుల్ని కరోనా బారి నుంచి కాపాడేందుకు చిరంజీవి ఐ అండ్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సమాయత్తమైంది. కరోనా సోకి రోగ విముక్తులైనవారు ప్లాస్మాదానం చేస్తే మరికొంతమందికి ఆయుషు పోసీనట్లే. ఈ నేపధ్యంలో పేదలైన కరోనా సోకిన రోగులకు ఉచితంగా ప్లాస్మా వితరణ చేసేందుకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ నిర్ణయం తీసుకుంది.

తెల్లరేషన్‌ కార్డుదారులు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్‌ పేషెంట్లకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ఉచితంగా ప్లాస్మా సరఫరా చేస్తోంది. పేదలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాల్సిందిగా విన్నపం. 22 సంవత్సరాలుగా మెగాస్టార్‌ శ్రీ చిరంజీవిగారు సొంత నిధులు వెచ్చించి 9 లక్షల 27 వేల మంది పేద రోగులకు చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌ ద్వారా ఉచితంగా రక్తనిధులు అందించారన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసేందుకు మిక్కిలి సంతోషిస్తున్నాం" అని అందులో పేర్కొంది. పేదవాళ్ళకి అండగా నిలుస్తున్న చిరంజీవిని అందరూ కొనియాడుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories