Chiranjeevi Daughter Sushmitha: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోన్న సుష్మిత కొణిదెల

Chiranjeevi Daughter Sushmitha: Megastar Chiranjeevi Daughter Sushmitha Entering Into Tollywood Soon
x

సుష్మిత కొణిదల ఇన్స్టాగ్రామ్ 

Highlights

Chiranjeevi Daughter Sushmitha: మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం

Chiranjeevi Daughter Sushmitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాల నుంచి మహిళలు రావాలంటే అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి. గతంలో ఘట్టమనేని కుటుంబం నుంచి సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజులా సినిమాల్లోకి రావాలనుకుంటే అభిమానులు అడ్డు తగిలిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ సినిమాల్లోకి రాలేదు. అయితే విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబం నుంచి మంచు లక్ష్మీ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మోగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక ఎంట్రీ ఇచ్చింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. సుష్మిత ఓ తమిళ థ్రిల్లర్' రైట్స్‌ను కొని తెలుగులో రీమేక్ చేయనుందని తెలుస్తోంది. ఆ సినిమా పేరే '8 తొట్టక్కల్' (8 బుల్లెట్లు). 8 తొట్టక్కల్ అనే సినిమా 2017లో తమిళంలో విడుదలై మంచి విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో వెట్రి అనే కొత్త హీరో నటించారు. హీరోయిన్‌గా అపర్ణ బాలమురళి నటించారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హీరో ఒక పోలీస్ ఆఫీసర్ అందులో భాగంగా ఒక నేరస్థుడిని పట్టుకునే ప్రయత్నంలో తన రివాల్వర్ పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత రివాల్వర్ ను దొంగిలించిన వ్యక్తి దానిని ఎక్కడో అమ్మేస్తాడు.

ఇక ఆ తర్వాత కథ ఎలా సాగింది అనేది సినిమా. థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా మంచి మలుపులతో సాగుతుంది. ఈ థ్రిల్లర్ మూవీని శ్రీ గణేశ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. ఇప్పుడు ఈ సినిమాను సుష్మిత తెలుగులో ఓ యంగ్ హీరోతో రీమేక్ చేయాలనీ ప్రయత్నిస్తోంది. చూడాలి మరి తెలుగు వారిని ఈ సినిమా ఎలా ఆకట్టుకోనుందో తెలిసిందే.

సుష్మిత గతంలో పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్య సుష్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్‌‌ను నిర్మించింది. అందులో భాగంగా సుష్మిత తన భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా 'షూటౌట్ ఎట్ ఆలేరు' అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఈ వెబ్ సిరీస్‌ ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌ జీ5లో స్ట్రీమ్ అయ్యి పరవాలేదనిపించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories