Megastar Chiranjeevi about Raavi Kondala Rao: చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది

Megastar Chiranjeevi about Raavi Kondala Rao: చిత్ర పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది
x
chiranjeevi , raavi kondala rao (File Photo)
Highlights

Megastar Chiranjeevi about Raavi Kondala Rao: ప్రముఖ తెలుగు సినీ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత రావి కొండలరావు తుదిశ్వాస విడిచారు.

Megastar Chiranjeevi about Raavi Kondala Rao: ప్రముఖ తెలుగు సినీ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత రావి కొండలరావు తుదిశ్వాస విడిచారు. గుండెపోటుతో హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన మరణించారు. ఆయ‌న మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ రావి కొండలరావు మరణం సినీ, నాటక రంగాలకు తీరని లోటుగా పేర్కొన్నారు. తమ నివాళులర్పించారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి అయనకి నివాళులు అర్పిస్తూ అయనతో ఉన్న జ్ఞాపకాలని గుర్తుచేసుకున్నారు.

"రావి కొండల రావు గారి ఆకస్మిక మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో నాకు సుదీర్ఘ అనుబంధం ఉంది. నేను సినిమాల్లోకి హీరోగా వచ్చిన తొలినాళ్ళనుండి రావి కొండల రావుతో మంచి అనుబంధం ఉంది. ఇక మా కాంబినేషన్ లో వచ్చిన చంటబ్బాయి , మంత్రిగారి వియ్యంకుడు చిత్రాలలో అయన కీలక పాత్రలు పోషించారు. అయన మరణం వల్ల నటుడినే కాదు గొప్ప రచయితను, పాత్రికేయున్ని కూడా కోల్పోయింది. మొత్తానికి చిత్ర పరిశ్రమ ఒక పెద్ద దిక్కను కోల్పోయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని చిరంజీవి అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో 1932లో జన్మించిన రావి కొండలరావు సుకుమార్ అనే కలం పేరుతో వివిధ పత్రికల్లో ఎన్నో కథలు రాశారు. అనంత‌రం ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు... రావి కొండల రావు చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తూ రచనలు చేసేవారు. 1965లో చదువు పూర్తి చేసి.. ఆనందవాణి పత్రికలో సబ్ ఎడిటర్‌గా శ్రీశ్రీ, ఆరుద్రలతో కలిసి పనిచేశారు. అనంతరం పనిచేస్తున్న కొడవటిగంటి కుటుంబరావు, నండూరి రామమోహనరావు, జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి మొదలైనవారితో పరిచయాలు ఏర్పరచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories