Apollo Hospital: అపోలో ఆస్పత్రి వద్ద మెగా అభిమానుల సంబరాలు

Mega Fans Congratulates Ram Charan & Upasana For Becoming Parents
x

Apollo Hospital: అపోలో ఆస్పత్రి వద్ద మెగా అభిమానుల సంబరాలు

Highlights

Apollo Hospital: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. అపోలో ఆస్పత్రిలో కొణిదెల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

Apollo Hospital: మెగాస్టార్ చిరంజీవి ఇంట ఆనందం వెల్లివిరిసింది. అపోలో ఆస్పత్రిలో కొణిదెల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అపోలో డాక్టర్లు, వైద్య సిబ్బంది ఉపాసనకు వేకువజామున పురుడుపోశారు. తల్లీకూతుళ్లు ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడించారు. దీంతో హీరో రాంచరణ్ ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఇదిలా ఉంటే.. మెగా ఫ్యామిలీలోకి ప్రిన్సెస్ రావడంతో అభిమానులంతా సంబరాలు జరుపుకుంటున్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి ఇప్పటికే చేరుకున్న అభిమానులు.. రామ్ చరణ్, ఉపాసనలు, చిరంజీవికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రామ్‌చరణ్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు బ్యానర్లు ప్రదర్శించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories