మాస్టర్ మూవీకి ఓటీటీ ఆఫర్ వాస్తవమే కానీ.. !

మాస్టర్ మూవీకి ఓటీటీ ఆఫర్ వాస్తవమే కానీ.. !
x
Highlights

తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ దళపతి , విజయ్‌ సేతుపతిల కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మాస్టర్‌".. లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి

తమిళ స్టార్‌ హీరోలు విజయ్‌ దళపతి , విజయ్‌ సేతుపతిల కలిసి నటిస్తున్న తాజా చిత్రం "మాస్టర్‌".. లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీపావళి సందర్బంగా రిలీజ్ చేసిన టీజర్ సినిమా పైన మరిన్నిఅంచనాలను పెంచేసింది. అయితే ఈ సినిమా రిలీజ్‌ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల చేస్తునరంటూ వార్తలు వచ్చాయి. దీనితో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ క్రమంలో సినిమా విడుదల గురించి చిత్రబృందం స్పందించింది. ఓ ప్రముఖ ఓటీటీ సర్వీస్‌ నుంచి తమకి ఆఫర్‌ వచ్చిన మాట వాస్తవమేనని కానీ సినిమాని ఓటీటీ ద్వారానే రిలీజ్ చేయనున్నామని వెల్లడించింది. థియేటర్‌ యజమానులు తమకి అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరింది.

టీజర్ రికార్డుల మోత

ఈ మూవీ టీజర్ యూ ట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఈ నెల 14న విడుదలైన మాస్టర్ టీజర్, రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతేకాదు16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూ ట్యూబ్‌లో ఎక్కువ లైక్స్ సొంతం చేసుకున్న టీజర్‌లలో ఒకటిగా నిలిచినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో కాలేజీ ప్రొఫెసర్ పాత్రలో విజయ్ కనిపిస్తున్నాడు. ఇక ఇందులో విజయ్ సరసన మాళవిక మోహనన్న హీరోయిన్ గానటిస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే విజయ్ 65 వ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించుకుంది సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రాన్ని ఫిబ్రవరి 2021 లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories