మారుతి తన దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా విశేషాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
కామెడీ టచ్ తో ఎటువంటి కథనైనా వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించగల దర్శకుడు మారుతి. చిన్న సినిమాలతో మొదలైన మారుతి ప్రస్థానం అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి చేరింది. వరుసగా నేచురల్ స్టార్ నానీ తో `భలే భలే మగాడివోయ్`, శర్వానంద్ తో మహానుభావుడు, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో `ప్రతిరోజూ పండగే` సినిమాలతో మంచి జోష్ మీడున్నారు మారుతి.
మూడు బ్యాక్ టు బ్యాక్ హిట్ల తరువాత మారుతి ఏ హీరోతో సినిమా చేస్తారనే అంశంపై చాలా కాలంగా మీడియాలో భిన్న కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇప్పటివరకూ అవేవీ నిజం కాలేదు. కాగా, ఇప్పుడు దర్శకుడు మారుతి తన సినిమా ఏమిటో ఆయనే చెప్పేశారు.
ట్విట్టర్ ద్వారా తన తరువాతి సినిమా ఏమిటో ప్రకటించారు మారుతి. మీడియాలో తన తరువాతి సినిమాల పై వచ్చిన కథనాలను ఒక వీడియోలో చూపించారు. వాటి తరువాత ఆ కథనాలపై తీర్పు ఇస్తున్నట్టుగా.. తన తరువాత సినిమా ఏమిటో రివీల్ చేశారు మారుతి. మారుతి చేసిన ఈ ప్రయోగం కొత్తగా ఉంది.
మారుతి స్వయంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. మాచో హీరో గోపీచంద్ మారుతి తరువాతి సినిమాలో హీరోగా కనిపించబోతున్నారు. ఈ సినిమాని గీతా-2 ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు కలసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమా గోపీచంద్ 29 వ సినిమా కాగా, మారుతి 10 సినిమా. అతి త్వరలోనే సినిమా పేరు.. ఫస్ట్ లుక్ విడుదల చేస్తానని మారుతి తన వీడియోలో తెలిపారు.
నిజానికి రవితేజ తో మారుతి సినిమా ఉంటుందని తీవ్రంగా ప్రచారం జరిగింది కానీ, చివరకు గోపీచంద్ హీరోగా సినిమా మొదలవ బోతోంది.
Happy to begin 2021 with positivity
— Director Maruthi (@DirectorMaruthi) January 7, 2021
And my next with Macho Hero @YoursGopichand garu
Happy to work with my friends @GA2Official @UV_Creations again hope this Time also it works😎
Happy new year to all ❤️
Need all ur blessings ENTERTAINMENT assured 😉🎥🎞️
Title & 1st look soon pic.twitter.com/lsmN5V9Fl5
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire