Prabuthwa Junior Kalashala: 'డూడుం డుక్కుడుం' సాంగ్ విడుదల చేసిన జీవీ ప్రకాష్ కుమార్

Mangli Dudum Dukkudum Song Released From Prabuthwa Junior Kalashala Punganuru Movie By Gv Prakash Kumar
x

Prabuthwa Junior Kalashala: 'డూడుం డుక్కుడుం' సాంగ్ విడుదల చేసిన జీవీ ప్రకాష్ కుమార్

Highlights

GV Prakash: మంగ్లీ మార్కుతో చార్ట్ బస్టర్ గా దూసుకుపోతున్న డూడుం డుక్కుడుం

Prabuthwa Junior Kalashala: ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కాలేజ్ ఫేస్ పూర్తిచేసుకుని వచ్చిన వారే ఉంటారు. కాలేజీలో ప్రేమలు ఎలా ఉంటాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాంటి కాలేజ్ లవ్ స్టోరీ గా వచ్చి ఎన్నో సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి ఈ నేపథ్యంలోనే ఓ యదార్థ సంఘటనను తీసుకొని ఎంతో ఆసక్తికరంగా మలిచారు డైరెక్టర్ శ్రీనాథ్ పులకురం. దీనికి ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కు సిద్దమైన క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా అన్ని మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. మోస్ట్ హపెనింగ్ సింగర్ మంగ్లీ పాడిన డూడుం డుక్కుడుం సాంగ్ ను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతులమీదుగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా సాంగ్ మొత్తం విన్న జీవి ప్రకాష్ కుమార్ అత్యద్భుతంగా ఉందని మేకర్స్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. సాంగ్ మ్యూజికల్ గా చాలా బాగుందని క్లాసికల్ టచ్ ఇవ్వడం తనకు పర్సనల్గా బాగా నచ్చిందని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ఈ సాంగ్ బాగా నచ్చడంతో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో అని ఆసక్తి పెరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని తాను బలంగా చెప్పగలనని జీవి ప్రకాష్ కుమార్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్తీక్ రోడ్రిగ్జ్ అందించిన బాణీలకు శ్రీ సాయి కిరణ్ అర్థవంతమైన లిరిక్స్ రాయగా వాటిని తనదైన శైలిలో శ్రోతలందరూ మళ్లీ మళ్లీ వినే విధంగా ఆలపించారు మంగ్లీ. ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకోగా సాంగ్ అదే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. కాలేజ్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాలో కాలేజీ జంట మధ్య డూడుం డుక్కుడుం అంటూ సాగుతున్న ఈ సాంగ్ అత్యంత ఆసక్తికరంగా ఉంది.

టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ చిత్రంలో ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కొవ్వూరి అరుణ సమర్పకురాలు కాగా భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వ్యవహరించారు. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు.


Show Full Article
Print Article
Next Story
More Stories