Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది.. అడవి పందులను వేటాడిన..

Manchu Vishnu Manager Kiran Hunted Wild Boars
x

Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు సిబ్బంది.. అడవి పందులను వేటాడిన.. 

Highlights

Manchu Vishnu: మంచు విష్ణు సిబ్బంది మరో వివాదంలో చిక్కుకున్నారు.

Manchu Vishnu: మంచు ఫ్యామిలీ మరో వివాదంలో చిక్కుకుంది. మంచు మనోజ్, మోహన్ బాబు మధ్య జరిగిన ఆస్తి వివాదం.. ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల సంచలనం స‌ృష్టించాయి. ఈ విషయాలు సద్దుమణుగుతున్న క్రమంలో మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుకుంది. మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను వేటాడటం ఇప్పుడు వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌ జల్‌పల్లిలోని అటవీ ప్రాంతంలో మంచు విష్ణు మేనేజర్ కిరణ్ చిట్ట అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకొచ్చాడు. అడవి పందిని వేటాడి తీసుకెళ్లినట్టు మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ ప్రసాద్ పై ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయని మంచు మనోజ్ తెలిపారు. వారిద్దరి చర్యలను తప్పుబడుతూ పలుమార్లు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసినట్టు చెప్పారు. అయినప్పటికీ వారిద్దరూ పట్టించుకోకుండా ఇలాగే చేశారని అన్నారు.

ఇదిలా ఉంటే మంచు విష్ణు సిబ్బంది అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవి పందులను వేటాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక మంచు ఫ్యామిలీ తీరు రోజు రోజుకి వివాదాస్పదంగా మారుతుంది. ఇటీవల మంచు విష్ణు, మనోజ్ జల్‌పల్లిలో చేసిన హంగామా అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారం ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటన సమయంలో మోహన్ బాబు ఓ జర్నలిస్టు పై దాడి చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. మరోవైపు మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని టాక్ వినిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories