Malvika Nair: ముద్దు సీన్లు గురించి మాళవిక ఏమంటుందంటే..

Malvika Nair Gave Clarity About the Kissing Scenes
x

Malvika Nair: ముద్దు సీన్లు గురించి మాళవిక ఏమంటుందంటే..

Highlights

Malvika Nair: ముద్దు సన్నివేశాల గురించి క్లారిటీ ఇచ్చిన మాళవిక నాయర్

Malvika Nair: గతంలో కొన్ని సినిమాలలో నటించినప్పటికీ కొద్దిరోజులుగా మాత్రమే మాళవిక నాయర్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. దానికి కారణం నిన్న మొన్నటిదాకా హోమ్లీ పాత్రలలో కనిపించిన ఈ భామ సడన్ గా బోల్డ్ పాత్రలలో దిగడం. నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి" అనే సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టీజర్ మరియు ట్రైలర్లలో చూస్తే ఈ సినిమాలో మాళవిక చాలా బోల్డ్ గా నటించినట్లు తెలుస్తోంది.

నాగశౌర్యతో కలిసి ముద్దు సన్నివేశాలలో రెచ్చిపోయిన మాళవిక నాయర్ అందరు దృష్టిని ఆకర్షిస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మాళవిక నాయర్ ఈ ముద్దు సన్నివేశాల గురించి చెప్పుకొచ్చింది. "ఆ ముద్దు సన్నివేశాన్ని చాలా నాచురల్ గా తీశారు. ఎలాంటి వల్గారిటీ కానీ టీజింగ్ యాంగిల్ కానీ లేకుండా ఆ సన్నివేశాన్ని చాలా బాగా తెరకెక్కించారు," అని చెప్పుకొచ్చింది మాళవిక. ఇక హీరో హీరోయిన్ల మధ్య స్టీమీ సన్నివేశాలు మాత్రమే కాక సినిమాలో ఒక అందమైన కథ కూడా ఉంటుందని, ఒక మెచ్యూర్డ్ ఎమోషన్ ఉంటుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాతో మాళవిక గత కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్న హిట్టును అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమా కాకుండా మాళవికా నాయర్ సంతోష్ శోభన్ హీరోగా "అన్నీ మంచి శకునములే" అనే సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories