ఆస్కార్ బరిలో నిలిచిన మళయాళ మూవీ జల్లికట్టు

ఆస్కార్ బరిలో నిలిచిన మళయాళ మూవీ జల్లికట్టు
x
Highlights

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి మలయాళ మూవీ జల్లికట్టు అధికారిక ఎంట్రీ ఇచ్చింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...

ప్రతిష్టాత్మక ఆస్కార్ బరిలోకి మలయాళ మూవీ జల్లికట్టు అధికారిక ఎంట్రీ ఇచ్చింది. ఫ్లిల్మ్ మేకర్ రాహుల్ రానైల్ నేతృత్వంలోని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యురీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. లిజో జోస్ పెలిసెరి దర్శకత్వంలో జల్లికట్టు మూవీ తెరకెక్కింది. మొత్తం ౨౬ చిత్రాలకు గాను ఈ సినిమా ఆస్కార్ బరిలోకి ఎంటర్ అయింది. త‌మిళ‌నాడులో వివాదాస్పద సంప్రదాయ‌మైన బుల్ టేమింగ్ స్పోర్ట్ ఆధారంగా సాగే జ‌ల్లిక‌ట్టు చిత్రంలో ఆంటోనీ వ‌ర్గీస్‌, చెంబ‌న్ వినోద్ జోస్‌ కీల‌క పాత్రల్లో నటించారు. హిందీ, మ‌ల‌యాళం, ఒరియా, మ‌రాఠి భాష‌ల నుంచి ఆస్కార్ బ‌రిలో మొత్తం 27 సినిమాలు నిలిచాయ్. మ‌నుషులు, జంతువుల మ‌ధ్య భావోద్వేగపూరిత స‌న్నివేశాల‌ను కళ్లకు క‌ట్టిన‌ట్టు చూపించిన జ‌ల్లిక‌ట్టు భార‌తదేశం గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రాల్లో ఒకటి. దీంతో ఈ సినిమాను నామినేట్ చేసిందని ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు ఛైర్మన్ రాహుల్ ర‌వైల్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories