Actor Bala: మూడో పెళ్లి చేసుకున్న నటుడు బాల.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..

Malayalam Actor Bala 3rd Marriage with his Relative Kokila Photos Goes Viral
x

Actor Bala: మూడో పెళ్లి చేసుకున్న నటుడు బాల.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఫొటోలు..

Highlights

Actor Bala: మలయాళ నటుడు బాల (బాలకుమార్‌) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు.

Actor Bala: మలయాళ నటుడు బాల (బాలకుమార్‌) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. కానీ ఇటీవల కుటుంబ సమస్యలతో బాల వార్తల్లో నిలిచారు. కొన్ని రోజుల క్రితం మాజీ భార్య అమృత సురేశ్‌ ఫిర్యాదు మేరకు బాలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయన వార్తల్లోకి ఎక్కారు. అయితే పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత కేవలం 24 గంటల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చిన బాల మరోసారి వార్తల్లో నిలిచారు.

తాజాగా మూడో పెళ్లిచేసుకున్న బాల మళ్లీ టాక్ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారారు. బుధవారం పెళ్లి చేసుకున్న బాల.. భార్యతో కేరళలోని కలూర్‌ పావకులం ఆలయానికి వచ్చారు. దీంతో మీడియా దృష్టి ఆయనపై పడింది. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిలను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాల.. కోకిల తన మామయ్య కూతురని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమెకు చిరకాల కోరిక ఉండేదని చెప్పుకొచ్చారు.

ఇలా కోకిల కోరిక నెరవేరిందని తెలిపారు. ఇక తాను కష్ట సమయంలో ఉన్న సమయంలో కోకిలనే తనకు మద్ధతుగా నిలిచిందని, తాను మళ్లీ పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావడానికి తనే కారణమంటూ బాల మీడియాకు వివరించారు. ఇక బాల కంగువ సినిమా దర్శకుడు శివకు స్వయాన తమ్ముడే. బాల మూడో పెళ్లి వార్త ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది.

ఇదిలా ఉంటే బాలకు మొదటి వివాహం 2010లో గాయని అమృత సురేష్‌తో జరిగింది. ఈ జంటకు అవంతిక అనే కుమార్తె ఉంది. వీరిద్దరూ 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎలిజబెత్ ఉదయ్‌ను 2021లో రెండో వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య తలెత్తిన వివాదాల కారణంగా 2023లో వీరిద్దరూ వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మూడో పెళ్లి చేసుకొని అందరినీ షాక్‌కి గురి చేశారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత కూడా తనను వేదిస్తున్నాడని మొదటి భార్య అమృత కేసు పెట్టడంతో పోలీసులు అరెస్ట్‌ చేయగా బెయిల్‌పై బాల కుమార్‌ బయటకు వచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories