Pushpa 2: పుష్ప-2 విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Pushpa 2: సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం పుష్ప. 2021 డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. పార్ట్-1 బ్లాక్‌బస్టర్ కావడంతో సుకుమార్ పుష్ప-ది రూల్ పార్ట్-2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ రిలీజ్ కాగా..ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది.
ఈ మూవీపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ ట్వీట్ చేశారు. స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ ఈ ఏడాది పుష్పదే రూల్ అంటూ పోస్ట్ చేశారు. 2024 విడుదల కానున్న పుష్ప-2 ఏ మేరకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతుందో వేచి చూడాల్సిందే.
#2024RulePushpaKa ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2024
Pushpa Raj is coming back this year to rule the worldwide box office 🔥🔥
May you all rule your year with ambition & determination and may you get everything you desire for 💫
Happy New Year 2024 ❤️#Pushpa2TheRule Grand Release Worldwide on 15th AUG… pic.twitter.com/u6VED8LZbr
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire