ఏప్రిల్ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్

ఏప్రిల్ సెంటిమెంట్ ఫాలో అవుతున్న మహేష్
x
Highlights

ఏప్రిల్ లో విడుదలైన అన్ని సినిమాలు హిట్ అవుతాయని, మే లో విడుదలైన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయని నమ్ముతాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. దానికి కారణం...

ఏప్రిల్ లో విడుదలైన అన్ని సినిమాలు హిట్ అవుతాయని, మే లో విడుదలైన అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతాయని నమ్ముతాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. దానికి కారణం లేకపోలేదు. గతంలో ఏప్రిల్ లో విడుదలైన 'పోకిరి' బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ లో విడుదలైన 'భరత్ అనే నేను' సినిమా కూడా మర్చిపోలేని హిట్ గా మిగిలిపోయింది. కానీ మే లో విడుదలైన సినిమాలు మాత్రం మహేష్ కు చేదు జ్ఞాపకాలే మిగిలాయి. అప్పట్లో 'నాని' సినిమా విడుదలైంది ఆ సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాక 'బ్రహ్మోత్సవం' సినిమా కూడా ఫ్లాపయింది.

అందుకే ఇప్పుడు 'మహర్షి' సినిమా విషయంలో అలా జరక్కూడదని అనుకుంటున్నాడు మహేష్. ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మహేష్ మాత్రం ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 25 వ తారీఖున మాత్రమే విడుదల చేయాలని పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. వాయిదా వేస్తే బాధ కానీ అనుకున్న తేదీకి విడుదల అవుతుంది కాబట్టి ఫ్యాన్స్ కూడా హ్యాపీ.

Show Full Article
Print Article
Next Story
More Stories